Indian Tank Driver: యుద్ధ ట్యాంకుల రేసులో భారత్‌ ఘన విజయం

రష్యాలో జరిగిన మిలిటరీ యుద్ధ ట్యాంకు రేసుల ఛాంపియన్‌షిప్‌లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.

ఈ పోటీల్లో ఇండియన్‌ ఆర్మీకి చెందిన డ్రైవర్‌ మన్‌దీప్‌సింగ్‌ 50 టన్నుల బరువున్న యుద్ధ ట్యాంకుతో దూసుకెళ్లి రేసులో అలవోకగా విజయం సాధించారు.  

భారత జాతీయ జెండా రెపరెపలాడుతుండగా యుద్ధ ట్యాంకు దూసుకెళుతున్న వీడియోను బ్రిగేడియర్‌ హర్దీప్‌సింగ్‌సోహి తన ఎక్స్‌(ట్విటర్‌) ఖాతాలో మే 27వ తేదీ పోస్టు చేశారు. ఈ ట్వీట్‌కు ఇండియన్‌ ఆర్మీ ట్యాగ్‌ను జత చేశారు. ఈ విజయానికిగాను ట్యాంకు డ్రైవర్‌ మన్‌దీప్‌సింగ్‌పై అభినందనలు వెల్లువెత్తు తున్నాయి. 

 

 

#Tags