NASA Hires SpaceX: ఐఎస్‌ఎస్‌ను కూల్చేయనున్న స్పేస్‌ఎక్స్‌!

ప్రతి గంటన్నరకు ఒకసారి భూమి చుట్టూ తిరిగే ఫుట్‌బాల్‌ స్టేడియం సైజు ఉన్న ఆకాశ ప్రయోగశాల.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌) త్వరలో నీలిసంద్రంలో కూలిపోనుంది.

2030 సంవత్సరాల నాటికి, పాతబడిపోయిన ఐఎస్‌ఎస్ అంతరిక్ష చెత్తగా మిగిలిపోకుండా, భవిష్యత్తు అంతరిక్ష ప్రయోగాలకు అడ్డంకిగా మారకుండా ఉండటానికి, నాసా దానిని భూమి కక్ష్య నుండి తప్పించాలని నిర్ణయించుకుంది.

స్పేస్‌ఎక్స్‌కు బాధ్యత ఇదే..
ఈ బాధ్యతను నాసా, రాకెట్ల తయారీలో అనుభవం ఉన్న ఎలాన్ మస్క్ యొక్క స్పేస్‌ఎక్స్ కంపెనీకి అప్పగించింది. జూన్ 26వ తేదీ నాసా ఈ ఒప్పందం గురించి ప్రకటించింది. దాదాపు రూ.7,036 కోట్ల విలువైన కాంట్రాక్ట్‌లో భాగంగా, స్పేస్‌ఎక్స్ యునైటెడ్ స్టేట్స్ డీఆర్బిట్ వెహికల్ (యూఎస్‌డీవీ)ను నిర్మించనుంది. ఈ వాహనం సముద్రంలో చిన్న పడవలను లాగే టగ్ బోటులా ఉంటుందని భావిస్తున్నారు.

ఐఎస్‌ఎస్‌ను దిగుమతి చేయడం:
ప్రస్తుతం భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న 430 టన్నుల బరువైన ఐఎస్‌ఎస్‌ను యూఎస్‌డీవీ నియంత్రిస్తూ, దశల వారీగా దిగువ కక్ష్యలకు తీసుకొస్తారు. చివరగా, దీన్ని పసిఫిక్ మహాసముద్రంలోని 'పాయింట్ నెమో' అనే నిర్మానుష ప్రాంతంలో కూల్చేస్తారు. ఈ ప్రాంతం నుండి దగ్గరలోని భూభాగానికి వెళ్లాలంటే కనీసం 2,500 కిలోమీటర్లు ప్రయాణించాలి.

Unemployment Rate In India: దేశంలో తగ్గుతున్న నిరుద్యోగ రేటు.. నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు.. కానీ..

ఐఎస్‌ఎస్ చరిత్ర..
అనేక శాస్త్రీయ ప్రయోగాలకు వేదికగా నిలిచిన ఐఎస్‌ఎస్ నిర్మాణం 1998లో ప్రారంభమై 2000లో పూర్తయింది. శూన్యంలో ఎన్నో భిన్న ప్రయోగాలకు ఐఎస్‌ఎస్‌ సాక్షిగా నిలిచింది. అమెరికా, రష్యా, కెనడా, జపాన్ తదితర దేశాలు దీని నిర్వహణ చూసుకుంటాయి. 2028లో ఐఎస్‌ఎస్ కార్యకలాపాలను నిలిపివేయాలని రష్యా ప్రకటించింది. 

#Tags