Blue Origin: 60 ఏళ్ల తర్వాత.. ఎట్టకేలకు నెరవేరిన కల..!

అమెరికాకు చెందిన మొట్టమొదటి నల్లజాతి వ్యోమగామి, ఎయిర్‌ఫోర్స్‌ మాజీ కెప్టెన్‌ ఎడ్‌డ్వైట్‌ కల ఎట్టకేలకు నెరవేరింది.

ఆయన వయసు 90 ఏళ్లు. ఈ వయసులో అంతరిక్ష ప్రయాణం విజయవంతంగా పూర్తిచేశారు. మే 19వ తేదీ బ్లూ ఆరిజిన్‌ ‘ఎన్‌–25’మిషన్‌లో అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు. 1963లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెన్నెడీ ‘నాసా’అంతరిక్ష ప్రయాణాల కోసం ఎడ్‌డ్వైట్‌ను కూడా ఎంపిక చేశారు. కానీ, ఆయనకు అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం అప్పట్లో లభించలేదు. 60 ఏళ్ల తర్వాత కల నెరవేర్చుకున్నారు. 

అంతరిక్షంలోకి వెళ్లిన వారిలో ఈయ‌న‌తో పాటుగా భార‌త్‌కు చెందిన‌ తోటకూర గోపీచంద్‌, ఫ్రాన్స్ బిజినెస్‌మెన్ సిల్వైన్‌ చిరోన్, వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ మేసన్‌ ఏంజెల్, కరోల్‌ షాలర్, అమెరికా టెక్‌ వ్యాపారి కెన్నెత్‌ ఎల్‌ హెస్ ఉన్నారు.

First Indian Tourist In Space: సరికొత్త రికార్డు.. అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగు వ్యక్తి!!

#Tags