Skip to main content

ISRO: జూలైలో జీశాట్‌–ఎన్‌2 ప్రయోగం

సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), భారత అంతరిక్ష వాణిజ్య విభాగానికి చెందిన న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థ సహకారంతో జూలై నెలాఖరులో జీశాట్‌–ఎన్‌2 (జీశాట్‌–20) అనే ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. సుమారు ఐదు టన్నుల బరువు (4,700 కిలోలు) కలిగిన ఈ ఉపగ్రహాన్ని స్పేస్‌ ఎక్స్‌ సంస్థకు చెందిన ప్రయోగ వేదిక నుంచి పాల్కన్‌ రాకెట్‌ ద్వారా ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు.
GSAT N2 launch in July  ISRO and New Space India Ltd. collaboration for satellite launch

దేశంలోని మారుమూల రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలకు బ్రాండ్‌బ్యాండ్, ఇన్‌–ఫ్లైట్‌ సేవలను అందించేందుకు ఇస్రోలోని ఫ్రొఫెసర్‌ యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌లో ఈ ఉపగ్రహాన్ని తయారుచేశారు. ఈ ఉపగ్రహం భూమికి 36 కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ఉండి 15 ఏళ్లపాటు సేవలు అందించే విధంగా రూపొందించారు.

చదవండి: ISRO: ఇస్రో మరో ఘనత.. ఫ్యూయెల్‌ సెల్‌ టెస్ట్‌ సక్సెస్

ఇది పూర్థిస్థాయి కమ్యూనికేషన్‌ ఉపగ్రహం కావడం విశేషం. ఇప్పటివరకు పంపిన కమ్యూనికేషన్‌ శాటిలైట్స్‌ ఒక ఎత్తయితే ఈ జీశాట్‌–ఎన్‌2 ఉపగ్రహం మాత్రమే ఒక ఎత్తు అని ఇస్రో పేర్కొంది. ఇప్పటికే ఉపగ్రహాన్ని రూపొందించి క్లీన్‌రూంలో పరీక్షలు పూర్తిచేశారు. వైబ్రేషన్‌ పరీక్షలను కూడా విజయవంతంగా నిర్వహించారు. ఇస్రోకి ఇది వాణిజ్యపరమైన ప్రయోగం కావడం విశేషం.

Published date : 17 Jun 2024 03:35PM

Photo Stories