Corporation Chairpersons: తెలంగాణ కార్పొరేషన్‌ చైర్‌ప‌ర్స‌న్స్‌గా బాధ్యతలు స్వీకరించిన నలుగురు వీరే..

తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు కార్పొరేషన్ల చైర్‌ప‌ర్స‌న్లు బాధ్యతలు స్వీకరించారు.

నేరెళ్ల శారద: తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. సికింద్రాబాద్‌లోని మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో మంత్రి సీతక్క సమక్షంలో ఈమె బాధ్యతలు చేపట్టారు.

నాయుడు సత్యనారాయణ గౌడ్: తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని గోల్కొండ హస్తకళల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

జ్ఞానేశ్వర్ ముదిరాజ్: రాష్ట్ర ముదిరాజ్ కో-ఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. మాసబ్‌ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమభవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

జెరిపేటి జైపాల్: రాష్ట్ర అత్యంత వెనుకబడిన కులాల అభివృద్ధి సంస్థ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. మాసబ్‌ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఈమె బాధ్యతలు చేపట్టారు.

Telangana State Anthem: తెలంగాణ రాష్ట్ర గేయం.. 13.30 నిమిషాలు.. 12 చరణాలు

#Tags