Queen Elizabeth II: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ ఇకలేరు... కొన్ని ముఖ్య విషయాలు!

బ్రిటన్‌ను సుదీర్ఘకాలం, 70 ఏళ్లకు పైగా పాలించి ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్షిగా నిలిచిన రాణి ఎలిజబెత్‌–2(96) ఇకలేరు.
Queen Elizabeth of Britain is no more

వేసవి విరామం కోసం స్కాట్లాండ్‌లోని బల్మోరల్‌ కోటలో ఉన్న రాణి సెప్టెంబర్ 8 న మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ ధ్రువీకరించింది. 

Also read: Rakesh Jhunjhunwala: స్టాక్‌ మార్కెట్‌ దిగ్గజం రాకేశ్‌ ఝున్‌ ఝున్‌ వాలా హఠాన్మరణం

1952లో 25 ఏళ్లకే బ్రిటన్‌ రాణి కిరీటం ధరించిన ఎలిజబెత్‌ అత్యధిక కాలం రాణిగా కొనసాగారు.  

ఎలిజబెత్‌–2 మరణంతో ఆమె కుమారుడు ప్రిన్స్‌ చార్లెస్‌ బ్రిటన్‌ రాజుగా, 14 కామన్వెల్త్‌ దేశాల అధినేతగా సంతాప కార్యక్రమాలను నిర్వహిస్తారు.  

 Also read: Fidel Valdez Ramos: ఫిలిప్పీన్స్‌ మాజీ అధ్యక్షుడు రామోస్‌ కన్నుమూత
 
ఇక బ్రిటన్‌ రాజు చార్లెస్‌ 
బ్రిటన్‌ రాజకుటుంబ నిబంధనల ప్రకారం... రాజు లేదా రాణి మరణిస్తే వారి వారసుడు/వారసురాలిగా మొదటి వరుసలో ఉన్నవారు తక్షణమే బ్రిటన్‌ రాజు/రాణిగా మారిపోతారు. ఈ లెక్కన ఎలిజబెత్‌–2 రాణి వారసుడిగా మొదటి వరుసలో మొదటి స్థానంలో ఉన్న పెద్ద కుమారుడు ప్రిన్స్‌ చార్లెస్‌ బ్రిటన్‌ రాజుగా మారినట్లే. అయితే, అధికారికంగా పగ్గాలు చేపట్టడానికి, పట్టాభిషేకానికి నిర్దేశిత లాంఛనాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకు కొన్ని నెలలు లేదా మరింత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఎలిజబెత్‌–2 విషయానికొస్తే తండ్రి మరణంతో 1952 ఫిబ్రవరి 6న రాణిగా మారారు. 16 నెలల తర్వాత.. 1953 జూన్‌ 2న పట్టాభిషక్తురాలయ్యారు.  

  • రాణి మరణించాక 24 గంటల్లోపు కొత్త రాజు పేరును యాక్సెషన్‌ కౌన్సిల్‌ లండన్‌లోని సెయింట్‌ జేమ్స్‌ ప్యాలెస్‌ నుంచి అధికారికంగా ప్రకటిస్తుంది.  
  • కొత్త రాజుకు విధేయత ప్రకటిస్తూ పార్లమెంట్‌ సభ్యులు ప్రమాణం చేస్తారు.  
  • ప్రైవీ కౌన్సిల్‌ ఎదుట నూతన రాజు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది.   
  • కొత్త రాజు పాలన మొదలైనట్లు యూకేలో పలుచోట్ల బహిరంగంగా ప్రకటిస్తారు.  
  • పట్టాభిషేక ప్రమాణ చట్టం–1689 ప్రకారం ప్రిన్స్‌ చార్లెస్‌ తన పట్టాభిషేక కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం           చేయాలి.    

Also read: మాజీ అంపైర్ Rudi Koertzen దుర్మరణం

సుదీర్ఘ కాలం రాణిగా.. 
ఎలిజబెత్‌–2.. పూర్తిపేరు ఎలిజబెత్‌ అలెగ్జాండ్రా మేరీ. 1926 ఏప్రిల్‌ 21న ఇంగ్లాండ్‌ రాజధాని లండన్‌లో కింగ్‌ జార్జి–6, క్వీన్‌ ఎలిజబెత్‌ దంపతులకు తొలి సంతానంగా జని్మంచారు. తల్లి ప్రోత్సాహంతో ఇంట్లోనే విద్యనభ్యసించారు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్‌ సైన్యంలోమహిళల విభాగంలో పనిచేశారు. 1947 నవంబర్‌ 20న గ్రీస్‌ అండ్‌ డెన్మార్క్‌ రాజకుమారుడు, దూరపు బంధువు అయిన ఫిలిప్‌ మౌంట్‌బాటెన్‌ను వివాహం చేసుకున్నారు. వారికి నలుగురు సంతానం.. ప్రిన్స్‌ చార్లెస్, ప్రిన్సెస్ అన్నె, ప్రిన్స్‌ ఆండ్రూ, ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌ జన్మించారు. ఎలిజబెత్‌–2 మహారాణి భర్త ఫిలిప్‌ 2021 ఏప్రిల్‌ 9న కన్నుమూశారు. ఆమె తండ్రి కింగ్‌జార్జి–6 1952లో మరణించారు. మగ వారసులు లేకపోవడంతో బ్రిటిష్‌ రాజకుటుంబ సంప్రదాయ ప్రకారం 1952 ఫిబ్రవరి 6న 25 ఏళ్ల వయసున్న ఎలిజబెత్‌–2 తదుపరి రాణిగా ఎంపికయ్యారు. అయితే, ఆ సమయంలో ఆమె కెన్యాలో అధికారిక పర్యటనలో ఉన్నారు. ఏడాది తర్వాత.. 1953 జూన్‌ 2న క్వీన్‌ ఆఫ్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఆఫ్‌ గ్రేట్‌ బ్రిటన్, ఉత్తర ఐర్లాండ్‌గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె పట్టాభిషేకానికి ప్రపంచదేశాల అధినేతలు హాజరయ్యారు. ఎలిజబెత్‌ ఏడు స్వతంత్ర కామన్‌వెల్త్‌ దేశాలకు.. యూకే, కెనడా, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, సీలోన్‌(శ్రీలంక)కు రాణిగా మారారు. 1977లో రజతోత్సవాలు, 2002లో స్వరో్ణత్సవాలు, 2012లో వజ్రోత్సవాలు, 2022లో ప్లాటినం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. 2022 సెప్టెంబర్‌ 8వ తేదీ దాకా నిరాటంకంగా పదవిలో కొనసాగారు.  బ్రిటిష్‌ చరిత్రలో సుదీర్ఘ కాలం (63 సంవత్సరాల 7 నెలల 2 రోజులు) రాణిగా కొనసాగినట్లు క్వీన్‌ విక్టోరియా పేరిట ఉన్న రికార్డును 2015 సెపె్టంబర్‌ 9న క్వీన్‌ ఎలిజబెత్‌ అధిగమించారు. అత్యధిక కాలం జీవించిన, అత్యధిక కాలం పదవిలో కొనసాగిన బ్రిటిష్‌ మోనార్క్‌గా చరిత్ర సృష్టించారు. అంతేకాదు ప్రపంచంలోనే అత్యధిక కాలం పదవిలో కొనసాగిన రెండో రాజు/రాణిగా రికార్డు నెలకొల్పారు.  

Also read: Former Japan PM: జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే హత్య

కీలక పరిణామాలకు మౌనసాక్షి  
70 ఏళ్లకు పైగా పాలనా కాలంలో ఎలిజబెత్‌–2 రాణి ప్రపంచంలో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ప్రాభవం వేగంగా క్షీణించడం, ప్రపంచాన్ని ఒంటిచేత్తో పాలించిన బ్రిటన్‌ ఒక చిన్న ద్వీపదేశంగా మిగిలిపోవడం, ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో బ్రిటిష్‌ పాలన అంతం కావడం వంటి ముఖ్యమైన పరిణామాలను మౌనంగా వీక్షించారు. బ్రిటిష్‌ ఛత్రఛాయ కింద ఉన్న దేశాల్లో స్వతంత్ర దేశాలుగా అవతరించాయి. గణతంత్ర రాజ్యాలుగా మారాయి. కొన్ని సందర్భాల్లో రాజకుటుంబంలో చోటుచేసుకున్న పరిణామాలు ఎలిజబెత్‌ రాణికి ఇబ్బందికరంగా పరిణమించాయి. విమర్శలకు తావిచ్చాయి. ఆమె నలుగురి సంతానంలో ముగ్గురి వివాహాలు విచ్ఛిన్నమయ్యాయి. కోడలు డయానా విషయంలో నిర్దయగా ప్రవర్తించి, ఆమె మరణానికి కారణమయ్యారంటూ ఎలిజబెత్‌పై ప్రసార మాధ్యమాలు సంస్థలు విమర్శనా్రస్తాలు ఎక్కుపెట్టాయి. అయినప్పటికీ ఆమె ప్రతిష్ట దెబ్బతినలేదు. ఆటుపోట్ల సమయంలో బ్రిటన్‌ ప్రజలు మద్దతుగా నిలిచారు. ఎలిజబెత్‌–2 హయాంలో బ్రిటన్‌కు 15 మంది ప్రధానమంత్రులు సేవలందించారు.  

Also read: Dr V Krishnamurthy: పబ్లిక్‌ రంగ పితామహుడు కృష్ణమూర్తి కన్నుమూత

క్వీన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆస్తులున్నాయి. ప్రపంచంలోని అత్యంత ధనిక మహిళల్లో ఆమె ఒకరిగా గుర్తింపు పొందారు.       – సాక్షి, నేషనల్‌ డెస్క్‌   

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

#Tags