Kashyap Patel: ‘ఎఫ్‌బీఐ’ డైరెక్టర్‌గా కశ్యప్ పటేల్
తదుపరి ‘ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ)’ డైరెక్టర్‌గా కశ్యప్‌ను నియమించనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు.
‘కాష్ గొప్ప లాయర్, దర్యాప్తులో దిట్ట. అమెరికాలో అవినీతి నిర్మూలనకు, న్యాయాన్ని గెలిపించేందుకే నిత్యం శ్రమించే ‘అమెరికా ఫస్ట్’ ఫైటర్’. అమెరికా ప్రజల రక్షణలో ఆయన కృషి గొప్పంది. కాష్ నియామకంతో ఎఫ్‌బీఐకి పునర్‌వైభవం తీసుకొస్తాం’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫాంలో పోస్టు చేశారు.
Jay Bhattacharya: అమెరికా ఎన్ఐహెచ్ డైరెక్టర్‌గా నియమితులైన భారతీయుడు
తొలి నుంచి ట్రంప్‌కు వీరవిధేయుడిగా కాష్‌కు పేరుంది. కశ్యప్ పూర్వీకులు భారత్‌లోని గుజరాత్ నుంచి వలస వెళ్లారు. అతడి తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. ఉగాండా నుంచి అమెరికాకు వలస వచ్చారు. 1980లో న్యూయార్క్‌లో కశ్యప్ జన్మించారు.
యూనివర్శిటీ ఆఫ్ రిచ్‌మాండ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశారు. అనంతరం మియామీ కోర్టుల్లో లాయర్‌గా వివిధ హోదాల్లో సేవలందించారు.
Transportation Secretary: అమెరికా రవాణామంత్రిగా ఫాక్స్ న్యూస్ హోస్ట్ సాన్ డఫీ