Prime Minister: హైతీ ప్రధానమంత్రి ఆరియల్ హెన్రీ రాజీనామా

హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధానమంత్రి పదవి నుంచి ఆరియల్ హెన్రీ వైదొలగుతున్నట్లు తెలిపారు.

హైతీ తీవ్రమైన హింసాత్మక ఘటనలతో కుదేలుకుంది. దీంతో ప్రజల నుంచి ప్రధానిపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. దేశంలో రాజకీయ స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి తాను తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు హెన్రీ అన్నారు.

ఈ రాజీనామాతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. రాజీనామా లేఖను ప్రధాని కార్యాలయం విడుదల చేసింది. తొమ్మిది మంది సభ్యులతో ఏర్పడిన ఒక కౌన్సిల్‌.. కొత్త ప్రధానిని ఎన్నుకునే వరకు ప్రస్తుత కేబినెట్‌లోని ఆర్థిక మంత్రి మిషెల్‌ ప్యాట్రిక్‌ ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారు. 2026లో కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకు దేశంలోని పాలనా వ్యవహారాలపై ఈ కౌన్సిల్‌ పర్యవేక్షణ కొనసాగనుంది.

Haiti crisis: నేర ముఠాల గుప్పిట్లో హైతీ.. అయ్యో పాపం అంటున్న యావత్‌ ప్రపంచం!!

హెన్రీ రాజీనామాకు కారణాలు..
➢ హైతీ తీవ్రమైన రాజకీయ అస్థిరతకు గురైంది. దీనికి కారణంగా పౌరుల నిరసనలు, హింసాచారం, అధ్యక్షుడు జోవెనెల్ మోయిస్ హత్య జరిగింది.
➢ హెన్రీ ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని పరిష్కరించడంలో విఫలమైందని విమర్శలు ఎదుర్కొంది.
➢ దేశంలో గాంధీ తిరుగుబాటుగా పిలువబడే ప్రజా ఉద్యమం కూడా బలపడింది. ఇది హెన్రీని రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.

Most Influential People: అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ఇద్దరు బారతీయ అమెరికన్లకు చోటు..!

#Tags