RBI : మానిటరీ పాలసీ నివేదికను విడుదల చేసిన ఆర్బీఐ..

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) ఆగస్ట్‌ 8న మానిటరీ పాలసీ నివేదికను విడుదల చేసింది. కీలక వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు చేయలేదు. అధిక ఆహార ధరల నేపథ్యంలో.. 9వ సారి కూడా పాలసీ రేట్లను యధాతథంగా కొనసాగించారు. గత ఏడాది ఏప్రిల్‌లో చివరిసారి వడ్డీ రేట్లను పెంచారు.

World’s Tallest Building: 3,000 అడుగుల ఎత్తయిన విద్యుత్‌ భవనం!

ఆ తర్వాత ఇప్పటి వరకు మళ్లీ పెరుగుదల కనిపించలేదు. ఈ సారి కూడా రెపో రేటును 6.5 శాతంగా కొనసాగించాలని మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించినట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ తెలిపారు. ఆహార ద్రవ్యోల్బణం అంశంలో ఎంపీసీ అప్రమత్తంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7.2 శాతం ఉంటుందని ఆర్‌బీఐ పేర్కొంది. 

#Tags