World’s Tallest Building: 3,000 అడుగుల ఎత్తయిన విద్యుత్ భవనం!
Sakshi Education
ప్రస్తుతం అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్, విల్లీస్ టవర్, దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా వంటివి ఎత్తయిన భవనాలుగా గుర్తింపు పొందాయి.
వాటిని తలదన్నేలా 3000 అడుగుల ఎత్తు అంటే ఏకంగా 914.4 మీటర్ల.. ఎత్తయిన భవనాన్ని నిర్మించనున్నట్లు స్కిడ్‌మోర్, ఒవింగ్స్ అండ్ మెరిల్ (ఎస్‌ఓఎం) కంపెనీ ప్రకటించింది.
నివాసానికే గాక విద్యుత్ నిల్వకు కూడా వీలు కల్పించడం దీని ప్రత్యేకత. ఇందుకోసం విద్యుత్ స్టోరేజీ కంపెనీ ‘ఎనర్జీ వాల్ట్’తో ఒప్పందం చేసుకుంది. విద్యుత్‌ను నిల్వచేసే బ్యాటరీలాగా ఇది పని చేస్తుందని కంపెనీ పేర్కొంది. భవనం వెలుపలి భాగంలో అమర్చే ఫలకాల్లో విద్యుత్‌ను నిల్వ చేస్తారు. దాన్ని అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటారు. ఈ భవనాన్ని ఎక్కడ నిర్మించాలన్నది ఇంకా ఖరారు చేయలేదు.
New Bridge : పాంగాంగ్ సరస్సుపై చైనా కొత్త వంతెన.. ఇన్ని మీటర్లు..
Published date : 12 Aug 2024 03:39PM