New Bridge : పాంగాంగ్ సరస్సుపై చైనా కొత్త వంతెన.. ఇన్ని మీటర్లు..
Sakshi Education
లద్ధాక్‌లోని పాంగాంగ్ సరస్సుపై చైనా కొత్త వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసింది. 400 మీటర్ల పొడవైన ఈ వంతెనపై ప్రస్తుతం తేలికపాటి వాహనాల రాకపోకలు సాగుతున్నట్టు జూలై 22న ప్రముఖ సంస్థలకు అందిన కొత్త చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి.
Old Soda Cans : శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా స్వచ్ఛ ఇంధనం తయారు..
1958 నుంచి చైనా ఆధీనంలో ఉన్న భూభాగంలో నిర్మితమైన ఈ వంతెన.. లద్ధాఖ్‌లో భారత్, చైనాల మధ్య గల వాస్తవాధీన రేఖకు సమీపాన ఉంది. పాంగాంగ్ సరస్సు ఉత్తర–దక్షిణ ప్రాంతాల మధ్య వేగంగా రాకపోకలు సాగించేలా ఈ వంతెన చైనా బలగాలకు వీలుకల్పిస్తుంది.
Published date : 07 Aug 2024 10:25AM