Development Projects: విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ.. ఆ ప్రాజెక్టులు ఏవంటే..

ప్రధాని న‌రేంద్ర‌ మోదీ అక్టోబ‌ర్ 20వ తేదీ వారణాసిలో రూ.6,700 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.

మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారణాసి శివారులోని సీగ్రాలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. ‘సబ్‌కా వికాస్‌’ సిద్ధాంతంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

మూడోసారి అధికారంలోకి వచ్చాక గత 125 రోజుల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా రూ.15 లక్షల కోట్ల విలువైన పనులు ప్రారంభించామని చెప్పారు. అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం తమ లక్ష్యమని ప్రకటించారు. 

ఎయిర్‌పోర్టు విస్తరణ పనులకు శంకుస్థాపన   
పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం సిలిగురి సమీపంలోని బాగ్‌డోగ్రా ఎయిర్‌పోర్టు విస్తరణ పనులకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రూ.1,550 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్‌ ఈ ఏడాది ఆగస్టులో ఆమోదం తెలిపింది.  

MSP Rate Hike: ఆరు పంటలకు మద్దతు ధర పెంచిన కేంద్ర ప్ర‌భుత్వం

శంకర కంటి ఆసుపత్రి ప్రారంభం 
వారణాసిలో కంచి మఠం ఆధ్వర్యంలో నిర్మించిన ఆర్‌జే శంకర కంటి ఆసుపత్రిని మోదీ ప్రారంభించారు. ఈ ఆస్పత్రిలో ఏటా 30 వేల కంటి శస్త్రచికిత్సలు ఉచితంగా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు మఠం వర్గాలు తెలిపాయి. 

#Tags