NITI Aayog : జూలై 16న నీతి ఆయోగ్‌ను పునర్వ్యవస్థీకరించింది.. చైర్మెన్‌గా..
కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వం.. మంత్రి మండలిలో మార్పుల తర్వాత జూలై 16న నీతి ఆయోగ్‌ను పునర్వ్యవస్థీకరించింది. చైర్‌పర్సన్ గా ప్రధాని నరేంద్ర మోదీ కొనసాగుతారు. వైస్‌చైర్మన్, పూర్తికాల సభ్యుల విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు.
Scheduled Caste : ఎస్సీ కులాల జాబితాను మార్చే అధికారం రాష్ట్రానికి లేదా!
వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కొత్త ఎక్స్ అఫీషియో సభ్యునిగా చేర్చగా.. ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.నడ్డా, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామిని నీతి ఆయోగ్‌లో భాగస్వాములను చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సవరించిన కూర్పు తర్వాత సుమన్ కే బెర్రీ వైస్‌చైర్మన్ గా.. వీకే సారస్వత్, రమేశ్‌చంద్, వీకేపాల్, అరవింద్ విర్మనీలు పూర్తికాల సభ్యులుగా కొనసాగుతారు.
#Tags