Female Cheetah Sasha: ఆడ చీతా సాషా మృతి

మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాల్లో ఒకటి మార్చి 27న మృతి చెందింది.
Cheetah Sasha

ఐదున్నరేళ్ల వయసున్న సాషా అనే ఆడ చీతా మరణించినట్లు అధికారులు వెల్లడించారు. జనవరిలో అది అనారోగ్యం బారినపడింది. రాష్ట్ర వైద్య బృందానికి తోడు నమీబియా డాక్టర్లనూ రప్పించారు. అది డీహైడ్రేషన్‌తో పాటు మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. కోలుకున్నట్టే కనిపించినా హఠాత్తుగా మరణించింది.
చీతాల్లో కిడ్నీ వ్యాధులు మామూలే...
సాషాతో సహా మొత్తం 8  చీతాలను 2022 సెప్టెంబర్‌లో నమీబియా నుంచి తెప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీటిని స్వయంగా కునో పార్కులోకి వదిలారు. అక్కడి వాతావరణానికి అవి బాగానే అలవాటుపడ్డాయి. అయితే చీతాల్లో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు తలెత్తడం సాధారణమేనని నిపుణులు చెబుతున్నారు. నమీబియా నుంచి తీసుకొచ్చినప్పటి నుంచే సాషా బలహీనంగా ఉందని అటవీ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. అన్ని ప్రయత్నాలూ చేశామని, అయినా కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

Cheetahs: యుద్ధ విమానాల్లో భారత్‌కు వచ్చిన చీతాలు

 

#Tags