Cheetahs: యుద్ధ విమానాల్లో భారత్‌కు వచ్చిన 12 చీతాలు
అనంతరం కునో నేషనల్ పార్కుకు హెలికాప్టర్లలో తరలించారు. వీటిలో ఐదు మగవి, ఏడు ఆడవి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యావద్ ఈ చీతాలను కునో నేషనల్ పార్క్ క్వారంటైన్ ఎన్‌క్లోజర్లలో విడుదల చేశారు. భారత వన్యప్రాణుల చట్టం ప్రకారం విదేశాల నుంచి వచ్చిన జంతువులు 30 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలి.
భారత్‌లో అంతరించిపోతున్న చీతాల సంఖ్యను పెంచేందుకు ఆఫ్రికా దేశాలతో భారత్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే గత ఏడాది సెప్టెంబర్‌లో 8 చీతాలు నమీబియా నుంచి భారత్‌కు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న వీటిని కునో నేషనల్ పార్కులో విడుదల చేశారు. తాజాగా వచ్చిన చీతాలతో కలిపి కునో నేషనల్ పార్కులో మొత్తం చీతాల సంఖ్య 20కి చేరింది.
చదవండి: చీతా.. చిరుత.. జాగ్వార్.. ఈ మూడింటిలో ఏది గ్రేట్ అంటే..?