QR Code Coin: భారత్‌లో తొలిసారి.. క్యూఆర్ కోడ్ ఆధారిత ‘చిల్లర’ యంత్రం
భారతదేశంలోనే తొలి క్యూఆర్ కోడ్ ఆధారిత కాయిన్ వెండింగ్ మెషీన్‌ను కేరళలో ప్రారంభించారు.
ఇది చిల్లర నాణేలు పొందే సమస్యకు సరైన పరిష్కారంగా నిలుస్తోంది. కోజీకోడ్‌లోని పుతియారాలో ఫెడరల్ బ్యాంక్ ద్వారా అందుబాటులోకి వచ్చిన ఈ మెషీన్, వినియోగదారులు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి యూపీఐ ద్వారా చెల్లించి, కావలసిన చిల్లర నాణేలను పొందగలుగుతారు.
ఈ వెండింగ్ మెషీన్‌లో 1, 2, 5, 10 రూపాయల నాణేలు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారు అవసరమైన చిల్లర నాణేలపై క్లిక్ చేస్తే, లావాదేవీ పూర్తయిన తర్వాత అవి మెషీన్ నుంచి బయటకు వస్తాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి డిజిటల్ చెల్లింపు యాప్‌ల ద్వారా కూడా నాణేలు విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఈ విధంగా.. వినియోగదారులకు చిల్లర నాణేలు సులభంగా అందుబాటులోకి రావడంతో పాటు, బ్యాంకు ఖాతా ఉండాలని కూడా నిర్బంధం లేకుండా, మెషీన్ ద్వారా అందించబడుతున్న నాణేలపై నియమాల విధానం ఉంది. కానీ భారీ మొత్తంలో విత్‌డ్రాకు పరిమితులు ఉన్నాయి.
#Tags