Supreme Court: సుప్రీంకోర్టులో మరోసారి మహిళా ధర్మాసనం

సుప్రీంకోర్టులో మరోసారి మహిళా న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఆసీనులైంది.

డిసెంబర్‌ 1వ తేది జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బేలా ఎం త్రివేదిల ధర్మాసనాన్ని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఏర్పాటు చేశారు. ఈ ధర్మాసనం 10 వైవాహిక బదిలీ, 10 బెయిలు పిటిషన్లు సహా 32 కేసులు విచారించింది. ఇలా కేవలం మహిళా న్యాయమూర్తులతో ధర్మాసనం ఏర్పాటు చేయడం సుప్రీంకోర్టు చరిత్రలో ఇది మూడోసారి. సుప్రీంకోర్టులో 2013లో జస్టిస్‌ జ్ఞాన సుధా మిశ్ర, జస్టిస్‌ రంజనా ప్రకాశ్‌ దేశాయ్‌లతో కూడిన ధర్మాసనం తదనంతరం 2018లో జస్టిస్‌ ఆర్‌.భానుమతి, జస్టిస్‌ ఇందిరాబెనర్జీలతో కూడిన ధర్మాసనాలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం సుప్రీంకోర్టులో జస్టిస్‌ బీవీ నాగరత్న సహా ముగ్గురు మహిళా న్యాయమూర్తులున్నారు. జస్టిస్‌ బీవీ నాగరత్న 2027లో ప్రధాన న్యాయమూర్తి కానున్న విషయం విదితమే.

అమరావతి రాజధాని కేసులో.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

#Tags