India's Population: 170 కోట్లు చేరుకోనున్న భారతదేశ జనాభా.. ఎప్పటిలోపు అంటే..?!

‘ది వరల్డ్‌ పాపులేషన్‌ ప్రాస్పెక్ట్స్‌ 2024’ పేరిట ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాలు, జనాభా విభాగం తాజాగా ఒక నివేదికను వెల్లడించింది.

నివేదిక ప్రకారం, భారతదేశ జనాభా 2100 నాటికి 150 కోట్లకు పడిపోతుందని అంచనా వేయబడింది. అయితే, ఆ శతాబ్దం చివరి వరకు కూడా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ నిలిచి ఉంటుందని ఊహించబడుతోంది.

ముఖ్యమైన అంశాలు ఇవే..

  • 2060 నాటికి భారత జనాభా 170 కోట్లకు చేరుకుని, ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ 2100 నాటికి 150 కోట్లకు చేరుకుంటుంది.
  • 2054 నాటికి, 169 కోట్లకు చేరుకున్న భారత జనాభా, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలుస్తుంది.
  • 2100 నాటికి చైనా జనాభా 63.3 కోట్లకు పడిపోతుంది. 2024 నుంచి 2054 మధ్య 20.4 కోట్ల మంది చైనా జనాభా తగ్గుతారు.
  • ప్రపంచవ్యాప్తంగా.. 126 దేశాల్లో జనాభా పెరుగుదల కొనసాగుతుంది. 2054 నాటికి ఈ జనాభా విస్ఫోటం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. భారత్, ఇండోనేసియా, నైజీరియా, పాకిస్తాన్, అమెరికా వంటి దేశాల్లో ఈ జనాభా విస్ఫోటం కనిపించనుంది.
     
  • 5 సంవత్సరాలలోపు చనిపోయే పిల్లల సంఖ్య 2023లో 5 లక్షలకు దిగజారింది. ఇది చరిత్రలోనే అత్యల్పం. చిన్నారుల మరణాల్లో 95 శాతం జనాభా బాగా పెరుగుతున్న కాంగో, భారత్, పాకిస్తాన్, నైజీరియా వంటి 126 దేశాల్లో నమోదవుతున్నాయి.
  • 2024లో ప్రపంచవ్యాప్త సగటు ఆయుర్దాయం 73.3 సంవత్సరాలుగా నమోదైంది. 1995 తో పోలిస్తే 8.4 సంవత్సరాలు పెరిగింది.
  • 2054 నాటికి, పాకిస్తాన్ జనాభా 38.9 కోట్లకు చేరుకుని, అమెరికాను అధిగమిస్తుంది. 2100 నాటికి మూడో అతిపెద్ద దేశంగా అవతరిస్తుంది.

IPE Global: జర జాగ్రత్త సుమా.. ప్రచండమైన ఎండలతో అల్లాడుతున్న భూమి!

#Tags