America Education Department : విద్యాశాఖ‌పై ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఈ కార‌ణంతోనే!

అమెరికా నూత‌న అధ్య‌క్షునిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌ను తీసుకోగా.. ప‌లు సంచ‌ల‌న మార్పుల‌ను కూడా ప్ర‌క‌టించారు.

సాక్షి ఎడ్యుకేష‌న్‌: అమెరికా నూత‌న అధ్య‌క్షునిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌ను తీసుకోగా.. ప‌లు సంచ‌ల‌న మార్పుల‌ను కూడా ప్ర‌క‌టించారు. అలాగే, ఇటీవ‌ల ఆయ‌న ప్ర‌క‌టించిన ఒక నిర్ణ‌యం కూడా మ‌రో సంచ‌ల‌న‌మైంది. వివ‌రాల్లోకి వెళితే.. అమెరికాలో విద్యాశాఖ‌ను మూసేస్తున్న‌ట్లు ట్రంప్ ఒక కీల‌క నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. 

విద్యాలో నిర్ణ‌యం..

అధికారంలోకి వ‌చ్చిన‌నాటి నుంచి ప్ర‌భుత్వంపై ప‌డుతున్న ఆర్థిక భారాన్ని త‌గ్గించ‌డానికి ట్రంప్ ప‌లు సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకోగా తాజాగా విద్యాశాఖ‌పై బాంబ్ పేల్చారు. ఇందులో భాగంగానే తాజాగా విద్యాశాఖ‌ను మూసేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డ‌ర్స్ జారీ చేశారు.

Sunita Williams: సునీత విలియమ్స్ చెందిన ఈ విషయాలు.. మీకు తెలుసా..?

గ‌త‌ నాలుగు దశాబ్దాలుగా ఈ విభాగంలో భారీగా ఖర్చు చేస్తున్నాప్ప‌టికీ ఇక్క‌డ విద్యా ప్రమాణాలు మెరుగుపడటం లేదు, యూరప్‌ దేశాలు.. చైనా కంటే అమెరికా వెనుకబడే ఉంది. కాగా, ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ట్రంప్ వెల్ల‌డించారు. కానీ, విద్యార్థులకు ఫీజుల రాయితీలు, మ‌రి కొన్ని ముఖ్యమైన పథకాలను మాత్రం కొనసాగిస్తామని వివ‌రించారు.

India and New Zealand: మోదీతో న్యూజిలాండ్‌ ప్రధాని క్రిస్టోఫర్‌ లక్సన్ భేటీ

గురువారం, మార్చి 20వ తేదీన వైట్‌హౌజ్‌లోని ఈస్ట్‌ రూమ్‌లో స్కూల్‌ పిల్లల మధ్య కూర్చుని ట్రంప్‌ ఈ ఉత్తర్వులపై సంతకం చేయడం గమనార్హం. ఇక‌, ఈ కార్యక్రమానికి రిపబ్లికన్‌ లీడర్లు, పలు రాష్ట్రాల గవర్నర్లు హాజరయ్యారు. విద్యాశాఖ విభాగాన్ని మూసివేస్తూ.. ఆ అధికారాన్ని రాష్ట్రాలకు అప్పగించండి అని విద్యాశాఖ కార్యదర్శి, డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ సీఈవో లిండా మెక్ మహోన్‌కు ఆదేశాలు జారీ చేశారు ట్రంప్‌.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags