Zircon Hypersonic Weapon: గగనతల రారాజు ‘జిర్కాన్‌’.. దీని ప్రత్యేకతలు ఎన్నో!!

రష్యా వద్ద ప్రపంచంలోనే అత్యాధునిక ఆయుధాలున్నట్లు వస్తున్న వార్తలకు బలం చేకూరేలాగా తాజా సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

ఇటీవల రష్యా అత్యాధునిక అస్త్రాన్ని ఉక్రెయిన్‌పై ప్రయోగించింది. ఈ విషయాన్ని మాస్కో బహిర్గతం చేయకపోయినా కీవ్‌ ఫోరెన్సిక్‌ పరిశోధనా సంస్థ బృందం గుర్తించింది. ఇటీవల కీవ్‌పై జరిగిన ఒక దాడిలో రష్యా జిర్కాన్‌ హైపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణిని వాడినట్లు ఆ బృందం వెల్లడించింది.
 
జిర్కాన్‌ ప్రత్యేకతలు..

➤ ఒక్కసారి జిర్కాన్‌ క్షిపణి గాల్లోకి ఎగరడం మొదలుపెడితే దాన్ని ప్రపంచంలోని ఏ అత్యున్నత గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకోలేదు.
➤ అమెరికాకు చెందిన మిసైల్‌ డిఫెన్స్‌ అడ్వొకసి అలయన్స్‌ అంచనా ప్రకారం ఈ క్షిపణి గంటకు 9,900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.
➤ ఒకవేళ ఇలా వస్తున్న వార్తలు నిజమైతే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్షిపణి జిర్కాన్‌.
➤ దాన్ని అడ్డుకోవడం దాదాపు అసాధ్యం. 

➤ ఈ క్షిపణి ప్రయాణించే సమయంలో దాని చుట్టూ ప్లాస్మా మేఘంతో వలయం ఏర్పడుతుంది.
➤ గగనతల రక్షణ వ్యవస్థల నుంచి వచ్చే రాడార్‌ సంకేతాలను అది తనలో కలిపేసుకుంటుంది.
➤ దీంతో ఈ క్షిపణిని గుర్తించడానికి వీలుండదు.
➤ అమెరికాకు చెందిన ‘ఏజిస్‌ క్షిపణి రక్షణ వ్యవస్థ’కు శత్రు అస్త్రాలను నేలకూల్చడానికి 8-10 సెకన్ల సమయం అవసరం.
➤ ఇంత స్వల్ప వ్యవధిలో జిర్కాన్‌ 20 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అందువల్ల ఏజిస్‌ క్షిపణికి కూడా అది అందదని రష్యా నిపుణులు చెబుతున్నారు.

Ukraine: ఉక్రెయిన్‌కు ఈయూ భారీ సాయం.. రూ.4.48 లక్షల కోట్లు..

#Tags