Ukraine: ఉక్రెయిన్‌కు ఈయూ భారీ సాయం.. రూ.4.48 లక్షల కోట్లు..
Sakshi Education
రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు సాయం చేసేందుకు యూరోపియన్ యూనియన్ సిద్ధంగా ఉంటుందని యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ మైకేల్ చెప్పారు.
ఫిబ్రవరి 1వ తేదీ బ్రస్సెల్స్‌లో సమావేశమైన ఈయూలోని 27 సభ్య దేశాల నేతలు ఉక్రెయిన్‌కు 54 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4.48 లక్షల కోట్లు)సాయం ప్యాకేజీని అందించేందుకు అంగీకరించినట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన తీర్మానంపై కేవలం గంటలోపే చర్చించి ఆమోదించినట్లు వివరించారు. సాయానికి సంబంధించిన తీర్మానాన్ని వీటో చేస్తామంటూ సభ్య దేశం హంగెరీ ప్రధాని విక్టర్ ఓర్బాన్ కొంతకాలం చేస్తున్న హెచ్చరికలను కూడా పట్టించుకోలేదన్నారు.
Published date : 03 Feb 2024 06:28PM