Indian Sailors: ఐదుగురు భారతీయ నావికుల విడుదల.. ఎక్క‌డి నుంచి అంటే..

ఇరాన్ స్వాధీనంలో ఉన్న వాణిజ్య నౌక ఎంఎస్‌సీ ఏరిస్‌లో బంధీలుగా ఉన్న ఐదుగురు భారతీయ నావికులు విడుదలయ్యారు.

ఈ నేపథ్యంలో భారత ఎంబసీ ట్విట్టర్‌ ద్వారా ఒక ప్రకటన చేసింది. నావికుల విడుదలకు భారత విదేశాంగ శాఖ చేసిన కృషి ఫలించింది. ఇరాన్ అధికారుల నుంచి సహకారం లభించిందని భారత ఎంబసీ తెలిపింది. టెహ్రాన్ ఇప్పటికే ఫిలిప్పీన్స్, ఎస్టోనియాకు చెందిన ఇద్దరు నావికులను కూడా విడుదల చేసింది.

వివరాలు..
➤ ఏప్రిల్ 13వ తేదీ ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ దళాలు హర్మూజ్ జలసంధి సమీపంలో ఎంఎస్‌సీ ఏరిస్‌ వాణిజ్య నౌకను హైజాక్ చేశాయి.
➤ ఈ నౌకలో మొత్తం 25 మంది సిబ్బంది ఉండగా, అందులో 17 మంది భారతీయులు ఉన్నారు.
➤ భారత విదేశాంగ శాఖ వీరిని విడిపించేందుకు చురుకైన చర్యలు చేపట్టింది.

➤ విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లాహియాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు.
➤ దాదాపు నెల రోజుల తర్వాత ఇరాన్ ఐదుగురు భారత నావికులను విడుదల చేసింది.
➤ ఈ నేపథ్యంలో భారత ఎంబసీ ట్విట్టర్‌ ద్వారా ఒక ప్రకటన చేసింది.
➤ నావికుల విడుదలకు భారత ప్రభుత్వం ఇరాన్‌కు కృతజ్ఞతలు తెలిపింది.

Israel-Hamas war: కాల్పుల విరమణకు హమాస్‌ ఆమోదం!

#Tags