Passport: అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉందో తెలుసా?

హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ తాజాగా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాను విడుదల చేసింది.

అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) నుంచి వచ్చిన డేటా ఆధారంగా ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఈ జాబితాలో భారత్ 82వ స్థానంలో ఉంది. ఇందులో పాకిస్తాన్ 100వ స్థానంలో ఉంది. 

★ శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో 195 దేశాలకు యాక్సెస్‌తో సింగపూర్ మొదటి స్థానంలో ఉండగా, ఆప్గనిస్థాన్ చివరి స్థానంలో ఉంది. 

★ ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, స్పెయిన్ (192) రెండో స్థానంలో ఉన్నాయి.
★ ఆస్ట్రియా, ఫిన్‌లాండ్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్వీడన్ (191) మూడో స్థానంలో ఉన్నాయి.

★బెల్జియం, డెన్మార్క్, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్ (190) నాలుగో స్థానంలో ఉన్నాయి.
★ ఆస్ట్రేలియా, పోర్చుగల్ (189) ఐదో స్థానంలో ఉన్నాయి.
★ గ్రీస్, పోలాండ్ (188) ఆరో స్థానంలో ఉన్నాయి.

★ కెనడా, చెకియా, హంగరీ, మాల్టా (187) ఏడో స్థానంలో ఉన్నాయి.
★ యునైటెడ్ స్టేట్స్ (186) ఎనిమిదో స్థానంలో ఉన్నాయి.
★ ఎస్టోనియా, లిథువేనియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (185) తొమ్మిదో స్థానంలో ఉన్నాయి.
★ ఐస్లాండ్, లాట్వియా, స్లోవేకియా, స్లోవేనియా (184) ప‌దో స్థానంలో ఉన్నాయి.

World Population: 1000 కోట్లు దాటనున్న ప్రపంచ జనాభా.. ఎప్ప‌టిలోపు అంటే..

#Tags