Morgan Stanley: మూడేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. మోర్గాన్ స్టాన్లీ అంచనా

ప్రస్తుతం.. భారత్ 2023 నాటికి 3.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉంది. 2026 నాటికి ఇది 4.7 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది. 2028 నాటికి, 5.7 ట్రిలియన్ డాలర్లతో జర్మనీని అధిగమించి మూడో స్థానానికి చేరుకుంటుందని భావిస్తోంది.
భారత్ ఆర్థిక వ్యవస్థ విస్తరణ: భారత్ గతంలో 1990 నాటికి ప్రపంచంలో 12వ స్థానంలో ఉండగా, 2020లో 9వ స్థానానికి, 2023లో 5వ స్థానానికి చేరుకుంది. 2029 నాటికి భారత్ ప్రపంచ జీడీపీలో 4.5 శాతం వాటా ఉంటుందని అంచనా.
2035 నాటికి ఆర్థిక వృద్ధి: మోర్గాన్ స్టాన్లీ 2035 నాటికి భారత్ ఆర్థిక వ్యవస్థ 6.6 ట్రిలియన్ డాలర్లుగా విస్తరించనున్నది. అత్యుత్తమ (బుల్ కేసు) పరిస్థితుల్లో ఇది 10.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తెలిపారు.
తలసరి ఆదాయం: 2025లో భారత్ సగటు ఆదాయం 2,514 డాలర్లుగా ఉంటుందని, 2035 నాటికి ఇది 6,706 డాలర్లుగా పెరుగుతుందని అంచనా వేసింది.
GST Growth: అతి తక్కువ జీఎస్టీ వృద్ధి.. ఏపీలోనే..!
వినియోగ మార్కెట్: భారత్ ప్రపంచంలో అత్యంత డిమాండ్ ఉన్న వినియోగ మార్కెట్‌గా మారనుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. ఇంధన పరివర్తనం, జీడీపీలో తయారీ రంగం వాటా పెరుగుతున్నాయి.
ఆర్థిక కోలుకునే పరిణామాలు: ప్రస్తుతానికి భారత్ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. 2024–25లో జీడీపీ వృద్ధి 6.3 శాతంగా ఉండటానికి అంచనా వేసింది. అలాగే 2025–26లో 6.5 శాతంగా ఉండొచ్చని తెలిపారు.
ద్రవ్యోల్బణం: 2024–25లో ద్రవ్యోల్బణం 4.9 శాతం ఉండవచ్చని, 2025–26లో 4.3 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది.
మందగమన ప్రభావం: ప్రపంచవ్యాప్తంగా మందగమనం లేదా మాంద్యం సంభవిస్తే, ఇది భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపవచ్చు. 2025లో భారత ఈక్విటీలు గరిష్ట స్థాయిలకు దూరంగా ఉండవచ్చు.
Repo Rate: లోన్లు తీసుకున్న వారికి శుభవార్త.. వడ్డీరేట్లు తగ్గించిన ఆర్బీఐ.. ఎంతంటే..