RBI Repo Rate: లోన్లు తీసుకున్న వారికి శుభవార్త.. రెపో రేటు తగ్గించిన ఆర్బీఐ

ఈ నిర్ణయం కేంద్ర బడ్జెట్‌లో పన్ను రేట్ల తగ్గింపు తరువాత తీసుకోబడింది. ఇది ఖర్చులను పెంచి, వృద్ధిని ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది.
ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (MPC) ఫిబ్రవరి 5వ తేదీ మూడు రోజుల సమావేశాన్ని ప్రారంభించింది. ఫిబ్రవరి 7న వడ్డీ రేట్లపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటన చేశారు.
పూర్వ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం ముగిసిన తర్వాత, మల్హోత్రా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది మొదటి ద్రవ్య విధాన కమిటీ సమావేశం. మార్కెట్లు రేటు తగ్గింపు కోసం ఆసక్తిగా ఎదురుచూశాయి. అందరూ అంచన వేసినట్లుగానే ఆర్బీఐ రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో బెంచ్‌మార్క్ రుణ రేటు ప్రస్తుత 6.5 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గింది.
Union Budget 2025: కేంద్ర బడ్జెట్ 2025–26.. పూర్తి వివరాలు ఇవే..
జీడీపీ వృద్ధి అంచనా..
ఆర్బీఐ రేటు నిర్ణయ ప్యానెల్ 2026 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధిని దాదాపు 6.7%గా అంచనా వేసిందని గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. అలాగే.. ద్రవ్యోల్బణం 4.2% వద్ద కొనసాగుతుందని ఆర్బీఐ ప్యానెల్ అంచనా వేసింది. కొత్త పంటల రాకతో ఆహార ద్రవ్యోల్బణం తగ్గిపోతుందని కూడా మల్హోత్రా తెలిపారు.
ఆర్‌బీఐ పూర్వ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో.. జరిగిన మునుపటి ఎంపీసీ సమావేశంలో రెపో రేటులో ఎటువంటి మార్పు చేయకుండా 6.5 శాతంగా యథతథంగా కొనసాగించారు. అయితే, నగదు నిల్వ నిష్పత్తి (CRR) 50 బేసిస్ పాయింట్లు తగ్గించారు.
నగదు ప్రవాహాన్ని పెంచడానికి ఆర్‌బీఐ బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ.1 ట్రిలియన్లను చొప్పించింది. డిసెంబర్ పాలసీలో కీలకమైన చర్య నగదు నిల్వ నిష్పత్తి (CRR) 50 బేసిస్ పాయింట్లు (bps) తగ్గించడం, బ్యాంకింగ్ వ్యవస్థలోకి రెండు విడతలుగా రూ.1.16 లక్షల కోట్లు ఇంజెక్ట్ చేయడం.