International Tea Day: నేడు అంతర్జాతీయ 'టీ' దినోత్సవం.. ఈ వెరై'టీ'ల గురించి తెలుసుకోండి

ప్రతి సంవత్సరం మే 21వ తేదీన అంతర్జాతీయ టీ దినోత్సవం జరుపుకుంటాం.

టీ యొక్క సాంస్కృతిక, ఆర్థిక ప్రాముఖ్యతను గుర్తించడానికి ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 21, 2019లో ఈ దినోత్సవాన్ని తీర్మానించింది. 

టీని ఉత్పత్తి చేయడం, వినియోగానికి అనుకూలమైన కార్యకలాపాలను అమలు చేసేందుకు సమిష్టి చర్యలు తీసుకోవడం, ప్రోత్సహించడం ఈ రోజు ప్రధాన లక్ష్యం.

దీని చరిత్ర ఇదే..
ఈశాన్య భారతదేశం, ఉత్తర మయన్మార్, నైరుతి చైనాలో ఈ టీ (Tea) ఉద్భవించిందని చాలా మంది నమ్ముతారు. కచ్చితమైన ప్రదేశం తెలియనప్పటికీ 5 వేల ఏళ్ల క్రితం చైనాలో మొదటిసారిగా టీ తాగినట్టు కొన్ని ఆధారాలున్నాయి. 
భారతదేశంతో పాటు శ్రీలంక, నేపాల్, వియత్నాం, ఇండోనేషియా, బంగ్లాదేశ్, కెన్యాస మలావి, మలేషియా, ఉగాండా, టాంజానియా వంటి టీ ఉత్పత్తి దేశాల్లో 2005 నుంచి అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆ రోజున టీ ఉత్పత్తి చేసే దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన పెంచడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీ వర్కర్స్ సంస్థలు సెమినార్లు, పబ్లిక్ ఈవెంట్‌లను నిర్వహిస్తూ సమావేశమవుతాయి.

World Hypertension Day 2024: మే 17న ప్రపంచ రక్తపోటు దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..

టీలో ప్రపంచం నలుమూలల ఉన్న వెరైటీలు ఇవే..
మాచా, జపాన్: గ్రీన్‌ టీ ఆకులతో ప్రాసెస్‌ చేసిన టీ పొడి. ఆకుపచ్చరంగులో ఉండే టీ. జపాన్‌లో ఈ టీ బాగా ఫేమస్‌. ఇది మట్టి రుచిని కలిగి ఉంటుంది. ముందు సిప్‌ చేస్తే చేదుగా ఉండి రానురాను మాధుర్యంగా ఉంటుంది. దీన్ని ఐస్‌డ్‌ టీ, ఐస్‌క్రీమ్‌లు, ఇతర డెజర్ట్‌లలో కూడా ఉపయోగించింది.

టెహ్ తారిక్, మలేషియా: టెహ్ తారిక్ అనేది మలేషియా నుంచి వచ్చిన ఒక ప్రసిద్ధ వేడి పాల టీ పానీయం. సాధారణంగా నురుగుతో ఉంటుంది. 'తే తారిక్' అనే పేరుకు "తీసి తీసిన టీ" అని అర్ధం. ఈ తీపి టీలో ఉడికించిన, స్ట్రాంగ్‌ బ్లాక్ టీ, ఆవిరైన క్రీమర్, పాలు ఉంటాయి. మరింత రుచిగా ఉండేలా ఏలకులను కూడా జోడించవచ్చు. 

చా యెన్, థాయిలాండ్: చా యెన్ ఒక ప్రసిద్ధ థాయ్ ఐస్‌డ్ టీ. ఇది మంచి రిఫ్రెష్ నిచ్చే పానీయం. ఇది బ్లాక్ టీ, రూయిబోస్ టీ, స్టార్ సోంపు, లవంగాలు, దాల్చినచెక్క, ఏలకులు, పాలు, పంచదారతో తయారు చేసే పానీయం. ఇది తీపి, క్రీము, సుగంధ రుచిని కలిగి ఉంటుంది. దీన్ని కొబ్బరి పాలను ఉపయోగించి కూడా తయారు చేసుకోవచ్చు. చా యెన్‌ని ఐస్‌ముక్కలతో సర్వ్‌ చేస్తారు.

మసాలా చాయ్: భారతదేశం ఇది చాలా ఫేమస్‌. చాలా మంది భారతీయులు తమ రోజును ప్రారంభించేందుకు లేదా సాయంత్రం విశ్రాంతి తీసుకోనే టైంలో ఈ మసాలా చాయ్‌ని ఆస్వాదిస్తారు. ఇది బిస్కెట్లు, రొట్టెలు లేదా పకోరస్ వంటి భారతీయ స్నాక్స్‌తో కూడా బాగా జత చేస్తుంది. 

మసాలా చాయ్‌ని మొదటగా వేడినీటిలో  ఆకుపచ్చ ఏలకులు, లవంగాలు, దాల్చినచెక్క, నల్ల మిరియాలు, అల్లం, సోపు గింజలు వంటి మొత్తం మసాలా దినుసులను  టీ ఆకులు వేసి బాగా మరిగిస్తారు. ఆ తర్వాత  పాలు జోడించి, కావాల్సిన రంగు వచ్చేలా టీని తయారు చేసుకోవాలి. చాలా మంది ప్రజలు తమ కప్పు మసాలా చాయ్‌ను ప్రిపేర్‌ చేసేందుకు చక్కెర లేదా బెల్లం కూడా కలుపుతారు.

World Football Day: మే 25వ తేదీ అంతర్జాతీయ ఫుట్‌బాల్ దినోత్సవం

సిలోన్ బ్లాక్ టీ, శ్రీలంక: సిలోన్ అనేది శ్రీలంకకు పూర్వపు పేరు, దీనిని ఇప్పటికీ టీ వ్యాపారంలో ఉపయోగిస్తున్నారు. శ్రీలంకకు చెందిన ఈ బ్లాక్ టీ స్ట్రాంగ్‌ రుచిని కలిగి ఉంటుంది. ఇది పూల వాసనలా ఉండి గొప్ప రంగును కలిగి ఉంటుంది. దీన్ని కూల్‌గా లేదా వెచ్చగా ఆస్వాదించవచ్చు.   

#Tags