Bank Holidays in May 2023: మేలో 12 రోజులు బ్యాంకులు బంద్‌.. సెల‌వుల జాబితా ఇదే

మే నెల బ్యాంక్ సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసింది. శని, ఆదివారాలతో సహా పండుగలు, ఇతర సందర్భాల కారణంగా మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు మూత పడనున్నాయి. ఈ బ్యాంకు సెలవులు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంటాయి.
Bank-Holidays-in May

సెలవుల జాబితా....

  • మే 1న  మహారాష్ట్ర డే/ మేడే కారణంగా బేలాపూర్, బెంగళూరు, చెన్నై, గౌహతి, హైదరాబాద్, కొచ్చి, కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, పాట్నా, త్రివేండ్రంలలో బ్యాంకులకు సెలవు.
  • మే 5న  బుద్ధ పూర్ణిమ సందర్భంగా అగర్తల, ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, చండీగఢ్, డెహ్రాడూన్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, రాయ్‌పూర్, రాంచీ, సిమ్లా , శ్రీనగర్‌లో బ్యాంకుల బంద్‌.
  • చ‌ద‌వండి: విద్యార్థుల‌కు ఉచితంగా బ్రేక్ ఫాస్ట్‌... సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న ప్ర‌భుత్వం
  •  

  • మే 7న ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకుల మూసివేత.
  • మే 9న రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా కోల్‌కతాలో బ్యాంకులకు సెలవు. 
  • మే 13న రెండో శనివారం దేశవ్యాప్తంగా సెలవు.
  • మే 14న  ఆదివారం బ్యాంకులకు సెలవు 
  • మే 16న  సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవం కారణంగా ఆ రాష్టంలో బ్యాంకుల  మూత.
  • చ‌ద‌వండి: సొంత ప్రిపరేషన్‌తో రైల్వే టీసీగా ఎంపికైన రైతు బిడ్డ

  • మే 21న ఆదివారం బ్యాంకులకు సాధారణ సెలవు
  • మే 22న మహారాణా ప్రతాప్ జయంతి నేపథ్యంలో సిమ్లాలో బ్యాంకుల బంద్‌. 
  • మే 24న కాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి సందర్భంగా త్రిపురలో సెలవు.
  • మే 27న నాల్గవ శనివారం సాధారణ సెలవు.
  • మే 28న ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు

సెలవు రోజుల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలు
సెలవు దినాల్లో, బ్యాంకులు మూతపడినప్పుడు మొబైల్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయవచ్చు. డబ్బును బదిలీ చేయడానికి UPIని ఉపయోగించవచ్చు. నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలను ఉపయోగించవచ్చు.

#Tags