Corrosion Awareness Awards 2023: ఏపీ నిట్‌ ఆచార్యుడుకి కొరోషన్‌ అవేర్‌నెస్‌ అవార్డు

ఏపీ నిట్‌లో మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్స్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన ఆచార్యుడు డాక్టర్‌ రఫీ మహ్మద్‌ ఇటీవల ముంబైలో ‘కొరోషన్‌ అవేర్‌నెస్‌’ అవార్డు అందుకున్నారు.

 అసోసియేషన్‌ ఫర్‌ మెటీరియల్స్‌ ప్రొటెక్షన్స్‌ అండ్‌ పెర్ఫార్మెన్స్‌ ఇండియా చాప్టర్‌ నిర్వాహకులు దేశవ్యాప్తంగా ఆచార్యులు చేస్తున్న పరిశోధనలను పరిశీలించి, వాటిలో అత్యున్నతమైన పరిశోధనలను ఎంపిక చేసి వారికి ‘కొరోషన్‌ పురస్కారం’ అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. 

Balasubramanian Menon: గిన్నిస్‌ రికార్డు సాధించిన కేరళ న్యాయవాది

ఈ ఏడాది రఫీకి ‘డిస్టింక్షన్‌ ఇన్‌కొరోషన్‌ సైన్సు అండ్‌ టెక్నాలజీ’ విభాగంలో అవార్డుకు ఎంపిక చేశారు. ఇటీవల ముంబైలో ‘కార్కాన్‌’ పేరుతో నిర్వహించిన అంతర్జాతీయ సమావేశంలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ముంబై) వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ పండిట్‌ అనిరుధ్‌ ఈ అవార్డును, రూ.25 వేల నగదు ప్రోత్సాహాన్ని రఫీకి అందజేశారు. 

AP High Court ASG: ఏపీ హైకోర్టు ఏఎస్‌జీగా నరసింహ శర్మ

#Tags