AP High Court ASG: ఏపీ హైకోర్టు ఏఎస్‌జీగా నరసింహ శర్మ
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేంద్రం తరఫున వాదనలు వినిపించేందుకు అడిషనల్ సొలి సి టర్ జనరల్ (ఏఎస్‌జీ)గా సీనియర్ న్యాయవాది బి.నరసింహ శర్మను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో ఏఎస్‌జీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకు అదనంగా ఏపీ బాధ్యతలను అప్పగించింది. నవంబర్ 15 నుంచి ఆరు నెలలు లేదా రెగ్యులర్ ఏఎస్‌జీని నియమించే వరకు నరసింహశర్మ ఆ బాధ్యతల్లో కొనసాగుతారు. ]
Sheetal Mahajan: శీతల్ ఎవరెస్ట్ జంప్
1959, నవంబర్ 22న పుట్టిన శర్మ ఉస్మానియా వర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. ఎల్‌ఎల్‌ఎంలో గోల్డ్ మెడల్ కూడా సాధించారు. 1982లో ఏపీ బార్ కౌన్సిల్‌లో ఎన్‌రోల్ చేసుకున్నారు. సివిల్, క్రిమినల్, ట్యాక్సేషన్, సర్వీస్ వ్యాజ్యాల న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్న ఆయన్ను హైకోర్టు గత డిసెంబర్‌లో సీనియర్ న్యాయవాదిగా నియమించింది.
PhD on PM Modi: మోదీపై పీహెచ్‌డీ చేసిన ముస్లిం మహిళ
Published date : 16 Nov 2023 04:26PM