Deepak C Mehta: ఐసీసీ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్న దీపక్ మెహతా

దీపక్ నైట్రైట్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ సి.మెహతా ఇటీవల 59వ ఇండియన్ కెమికల్ కౌన్సిల్ (ICC) వార్షిక అవార్డుల కార్యక్రమంలో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు.

దీపక్ మెహతా రసాయన పరిశ్రమలో ఒక విప్లవాత్మక నాయకుడిగా గుర్తించబడ్డారు. ఆయన మాజీ ఇండియన్ కెమికల్ కౌన్సిల్ అధ్యక్షుడిగా, భారత ప్రభుత్వ రసాయన పరిశ్రమ టాస్క్ ఫోర్స్‌లో ముఖ్య సభ్యుడిగా, భారత దేశాన్ని ప్రపంచ రసాయన తయారీ శక్తిగా మారుస్తున్న ప్రాజెక్టుల్లో కీలక పాత్ర పోషించారు.

ప్రస్తుతం ఆయన ఫిక్కీలో నేషనల్ కెమికల్స్ కమిటీ, సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్ చైర్మన్‌గా ఉన్నారు. ఇది ఈ రంగాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన అంకితభావాన్ని చూపిస్తుంది.

ఐసీసీ అవార్డు.. దీపక్ గ్రూప్‌ను రసాయన రంగంలో అగ్రగామిగా మార్చడంలో ఆయన దూరదృష్టి నాయకత్వానికి, ఈ రంగం భవిష్యత్తుకు ఆయన కృషికి గుర్తింపుగా ఇవ్వబడింది. ఆయన నేతృత్వంలో.. దీపక్ నైట్రైట్ సంస్థ స్తిరమైన అభివృద్ధి,  ఆవిష్కరణల ప్రామాణికాలకు అనుగుణంగా అనేక మైలురాళ్లను అందుకుంది.

Chiranjeevi: గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో మెగాస్టార్ చిరంజీవికి చోటు.. ఈ ఘనత సాధించిన ఏకైక హీరో ఈయ‌నే..

#Tags