Tulsi Chaitanya: ఏపీ పోలీస్‌ తులసి చైతన్యకు టెంజింగ్ నార్గే అవార్డు..

ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగానికి చెందిన మోతుకూరి తులసి చైతన్య జనవరి 9, 2024న‌ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మక టెంజింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్ అందుకున్నారు.

తులసి చైతన్య ఏపీ పోలీస్ విభాగంలో హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. వాటర్ అడ్వెంచర్ విభాగంలో 2022 సంవత్సరానికి ‘టెంజిగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు’కు ఆయన ఎంపికయ్యారు.

ఈ ఘనత సాధించిన తొలి పోలీస్‌..
ఈ నెల 5న కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ ఈ విషయాన్ని ప్రకటిస్తూ చైతన్యకు లేఖ రాసింది. అవార్డులో భాగంగా పతకంతో పాటు రూ.15 లక్షల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం చైతన్యకు అందించింది. ఈత పోటీల్లో అనేక అవార్డులు, పురస్కారాలు అందుకున్న తులసి చైతన్య, తనలా మరికొందరికి స్విమ్మింగ్‌లో శిక్షణ కూడా ఇస్తున్నారు. ఓపెన్ వాటర్ స్విమ్మింగ్‌లో ట్రిపుల్ క్రౌన్ సాధించిన మొదటి భారతీయ పోలీసు అధికారిగానూ ఆయన రికార్డు సృష్టించారు.

2022 జులై 26న ఇంగ్లాడ్ – ఫ్రాన్స్ దేశాల మధ్య ఇంగ్లిష్ ఛానెల్‌ (33.5 కి.మీ)ను 15 గంటల 18 నిమిషాల 45 సెకన్లలో ఈదుకుంటూ చేరుకున్నారు. జిబ్రాల్టర్ జలసంధి, కేటలినా ఛానల్, పాక్ జలసంధి సహా అనేక సాహసోపేతమైన ఈత పోటీల్లో ఆయన పాల్గొని విజయం సాధించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను 2022 సంవత్సరానికి గాను ‘టెంజిగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు’కు ఎంపిక చేసింది. తులసి చైతన్యలో ఉన్న ప్రతిభను గుర్తించిన సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేది ప్రోత్సహించి వెన్నుదన్నుగా నిలిచారు.

Arjuna Awards 2023: అర్జున అవార్డు అందుకున్న షమీ.. ఎంత మంది క్రీడాకారులు ఈ అవార్డు తీసుకున్నారంటే..?

 

#Tags