Singareni Workers Dussehra Bonus 2023 : సింగరేణి కార్మికులకు భారీగా దసరా బోనస్.. ఒకోక్క ఉద్యోగికి ఎంతంటే..?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విధంగా గత ఏడాది సింగరేణి సాధించిన రూ.2222.46 కోట్ల రూపాయలలో 32 శాతం లాభాల బోనస్‌ను దసరా పండుగకు వారం రోజుల ముందే చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. సగటున ఒక్కో ఉద్యోగికి రూ. 153000 వరకు లాభాల బోనస్ అందనుందని ఆయన పేర్కొన్నారు.
తొలిసారిగా..
గతేడాది లాభాల వాటాలో 30 శాతం బోనస్‌గా చెల్లించగా, ఈసారి రెండు శాతం పెంచారు. ఏటా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం వచ్చే దసరా పండుగకు ముందే బోనస్ చెల్లిస్తారు. 11వ వేతన సవరణ సంఘం బకాయిల కింద ఈ నెలలో సింగరేణి సంస్థ ఉద్యోగులకు రూ.1450 కోట్లు చెల్లించిన విషయం తెలిసిందే. దీపావళి బోనస్ చెల్లింపులపై సైతం త్వరలో సంస్థ యాజమాన్యం ఓ నిర్ణయం తీసుకోనుంది. సింగరేణి సంస్థ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో లాభాల బోనస్ చెల్లించనుండడం ఇదే తొలిసారి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి సింగరేణి లాభాల్లో వాటాను కార్మికులకు బోనస్‌గా ఇచ్చే సంప్రదాయం కొనసాగుతోంది. 1998లో తొలిసారిగా లాభాల్లో పది శాతాన్ని కార్మికులకు అందించారు.
42 వేల మంది కార్మికులు..
రాష్ట్రంలో ఆరు జిల్లాల పరిధిలో సింగరేణి విస్తరించి ఉంది. 42 వేల మంది కార్మికులు/ఉద్యోగులు సంస్థలో పనిచేస్తున్నారు. హైకోర్టు తీర్పును అనుసరించి వచ్చే నెలలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేప థ్యంలోనే ఎరియర్స్, బోనస్ చెల్లింపులు చకచకా సాగుతున్నాయనే భావన కార్మిక వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ECIL Hyderabad Recruitment 2023: టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు.. నెలకు రూ.31,000 వరకు జీతం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్