Infosys Recruitment 2024 : గుడ్‌న్యూస్‌.. ఇన్ఫోసిస్‌లో కొత్తగా 20000 ఉద్యోగాలకు ప్ర‌క‌ట‌న‌.. పూర్తి వివ‌రాలు ఇవే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇన్ఫోసిస్ నిరుద్యోగుల‌కు భారీ గుడ్‌న్యూస్ చెప్పింది. కొత్తగా 20వేల మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. వరుసగా 6 త్రైమాసికాల్లో ఇన్ఫోసిస్ ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ వచ్చిన విష‌యం తెల్సిందే. ఈ ఆర్థిక సంవత్సరంలో మాత్రం భారీగా నియామకాల్ని చేపడతామని సంస్థ పేర్కొంది.

తాజా పట్టభద్రుల కోసం ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ ఏడాది జూన్ త్రైమాసికం చివరి నాటికి సంస్థలో 3,15,332 మంది ఉద్యోగుల ఉన్నారు. ఇన్ఫోసిస్ ఉద్యోగుల సంఖ్య ఇంకా భారీగా పెంచుకోనున్న‌ది. కంపెనీలో జూన్‌ త్రైమాసికంలోనూ ఉద్యోగుల సంఖ్య తగ్గింది. నికరంగా 1,908 మంది బయటకు వెళ్లడంతో జూన్‌ చివరకు మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,15,332కు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.., 20,962 మంది తగ్గినట్లు లెక్క.

☛ TCS Jobs 2024 : గుడ్‌న్యూస్‌.. 40,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలు ఇస్తాం.. ఇంకా ఉద్యోగాల‌కు భారీగా ఇంక్రిమెంట్స్..!

తాజా పట్టభద్రుల ఉత్తీర్ణులకు ఉద్యోగాలు..
వృద్ధికి అనుగుణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 20,000 మందిని కాలేజీ ప్రాంగణాల నుంచి నియమించుకుంటామని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మాత్రం.. ఇతర దిగ్గజ ఐటీ కంపెనీల తరహాలోనే తాజా ఉత్తీర్ణులను అధికంగానే నియమించుకుంటామని తెలిపింది. 2024-25లో 20,000 మంది తాజా ఉత్తీర్ణులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇందుకోసం ప్రాంగణ, ప్రాంగణేత (ఆఫ్‌ క్యాంపస్‌) ఎంపికలు నిర్వహిస్తామని సీఎఫ్‌ఓ జయేష్‌ సంఘ్రాజ్కా స్పష్టం చేశారు. గతంలో ఆఫర్‌ లెటర్లు ఇచ్చిన అందరినీ కంపెనీలోకి రప్పించినట్లు తెలిపారు.

#Tags