Jobs: ఇక ఉద్యోగులకు గడ్డుకాలమే.. ఈ ప్రముఖ కంపెనీలో కూడా దాదాపు 6,000 మంది ఇంటికి..
ల్యాప్‌టాప్, ఎలక్ట్రానిక్స్ తయారీదారు హెచ్‌పీ సంస్థ దాదాపు 6,000 ఉద్యోగాలను కోతను ప్రకటించింది. ఫ్యూచర్ రెడీ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్లాన్‌లో భాగంగా 2025 ఆర్థిక సంవత్సరం చివరి వరకు ఉద్యోగుల తొలగింపులను విస్తరించాలని కంపెనీ నిర్ణయించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపు 12 శాతం మంది ఉద్యోగులపై వేటు వేయనుంది.
Google : గూగుల్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. 10000 మందిని తొలగింపు !
దాదాపు 50,000 మంది ఉద్యోగులు..
హెచ్‌పీ కంపెనీలో ప్రస్తుతం దాదాపు 50,000 మంది ఉద్యోగులున్నారు. రాబోయే సంవత్సరాల్లో 12 శాతం అంటే దాదాపు 4 నుంచి 6వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. 2025 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగుల్లో కొంతమందిని తొలగించాలని భావిస్తోంది. 2022 పూర్తి సంవత్సర నివేదిక సందర్భంగా ఈ ప్రకటన చేసింది. మహమ్మారి సమయంలో ల్యాప్‌టాప్స్ విక్రయాలు కాస్త పుంజుకున్నప్పటికీ, ప్రస్తుతం పడిపోయిన ఆదాయాలు, ప్రపంచ ద్రవ్యోల్బణం మాంద్యం ఆందోళనల మధ్య ఉద్యోగాలను తగ్గించాలనే నిర్ణయం తీసుకుంది. మరోవైపు బలహీనమైన డిమాండ్ కారణంగా మొదటి త్రైమాసికంలో ఆశించిన దానికంటే తక్కువ లాభాలను అంచనా వేస్తోంది.
Career Tips : మీ ఉద్యోగం పోయిందా..! అయితే వీటికి జోలికి అసలు వెళ్లొద్దు..