Infosys Narayana Murthy Success Story : నాడు రూ.10 వేలు పెట్టుబ‌డి పెట్టా.. నేడు వేల కోట్ల సామాజ్రాన్ని నిర్మించానిలా..

ఇన్ఫోసిస్.. భారతీయులందరికీ సుపరిచితమైన సంస్థ ఇది. దిగ్గజ భారత ఐటీ సంస్థల్లో ఒకటిగా ఇన్ఫోసిస్ గుర్తింపు తెచ్చుకుంది.

కేవలం 350 డాలర్ల పెట్టుబడితో ప్రారంభమైన ఈ సంస్థ.. వేల కోట్ల సామాజ్రంగా ఎదిగింది. ఇన్ఫోసిస్ ఈ స్థాయికి చేరడంలో నారాయణమూర్తిది ప్రధాన పాత్ర. ఐఐటీ కాన్పూర్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిన నారాయణమూర్తి.. ఆ తర్వాత ఐఐఎం అహ్మదాబాద్‌లో పని చేశారు. కొన్నాళ్లకే ఉద్యోగాన్ని వదిలేసి.. ఐటీ రంగంలోకి అడుగుపెట్టారు.

Infosys Sudha Murthy : ఈ ప‌ని చేయ‌డం అనుకున్నంత సులువు కాదు..కానీ

భార్య దగ్గర రూ. 10 వేలు అప్పు చేసి..

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య దగ్గర రూ. 10 వేలు అప్పు చేసిన నారాయణమూర్తి.. ఆ కొద్ది సొమ్ముతో రూ.17 వేల కోట్ల సామాజ్రాన్ని నిర్మించాడు. దేశంలోని తొలి కంప్యూటర్ షేరింగ్ సిస్టమ్ కోసం పని చేసిన మూర్తి.. ఈసీఐఎల్ కోసం బేసిక్ ఇంటర్‌ప్రిటర్‌ను రూపొందించారు. సాఫ్ట్రోనిక్స్ పేరిట తొలి సంస్థను ప్రారంభించిన మూర్తి.. ఆ సమయంలోనే సుధా మూర్తితో ప్రేమలో పడ్డారు. ఏడాదిన్నర తర్వాత మూర్తి ఆ సంస్థను మూసివేయాల్సి వచ్చింది.

తప్పనిసరి పరిస్థితుల్లోనే..

ఉద్యోగం చేస్తేనే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని సుధామూర్తి తండ్రి చెప్పడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో పుణేలోని ప్యాట్నీ కంప్యూటర్ సిస్టమ్స్‌లో జనరల్ మేనేజర్‌గా చేరారు. 1981లో ఉద్యోగం మానేసిన మూర్తి.. భార్య దగ్గర పదివేల రూపాయలు తీసుకొని ఇన్ఫోసిస్‌ను ప్రారంభించారు. నాలుగేళ్లు తిరిగేసరికే.. ఇన్ఫోసిస్ పెద్ద సంస్థగా అవతరించి.. 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగింది. ఆయన కూడా ఊహించిన రీతిలో దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ సంస్థగా రూపొందింది.

Sudha Murty: పేరెంటింగ్‌.. ఇది ఒక మహాయజ్ఞంతో సమానం

30 ఏళ్లపాటు..

రూ.10 వేలతో మొదలైన ఇన్ఫోసిస్ ప్రస్థానం.. 2019లో రూ.21 వేల కోట్లకు పైగా వార్షికాదాన్ని ఆర్జించే స్థాయికి చేరుకుంది. ఐటీ ప్రపంచానికి పితామహుడిగా నారాయణమూర్తి ఆవిర్భవించారు. 30 ఏళ్లపాటు ఇన్ఫోసిస్‌తో కలిసి సాగిన మూర్తి.. 2011లో చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. విశాల్ సిక్కాకు మేనేజ్‌మెంట్ బాధ్యతలు అప్పగించారు.. కానీ రెండేళ్ల తర్వాత మళ్లీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా విధుల్లో చేరారు. 2014లో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి వైదొలిగిన మూర్తి.. తర్వాత గౌరవ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 2000 సంవత్సరంలో పద్మశ్రీ.. 2008లో పద్మ విభూషణ్ పురస్కారాలు ఆయన్ను వరించాయి.

పిల్ల‌లు..

నారాయణమూర్తి కుమారుడు రోహన్ మూర్తి, కుమార్తె అక్షతా మూర్తి. రోహన్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని సొసైటీ ఆఫ్ ఫెలోస్‌లో జూనియర్ ఫెలో,  ఒక రకమైన రోబోటిక్ ఖగోళ శాస్త్ర ప్రాజెక్ట్ Robo-AO ప్రాజెక్ట్‌లో పెట్టుబడి పెట్టారు. అలాగే అక్షత స్టాన్‌ఫోర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ (MBA) పూర్తి చేసింది.

ఇన్ఫోసిస్ సైన్స్ అవార్డుకు ఎంపికైన సీసీఎంబీ శాస్త్రవేత్త?

అల్లుడు బ్రిటన్ ప్రధానిగా..

నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 2009లో రిషి సునక్.. అక్షతా మూర్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీయే చేసిన అక్షతా మూర్తి ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేశారు. అక్షత తన ప్రేమ సంగతి చెప్పగా.. ముందుగా నారాయణ మూర్తి అంగీకరించలేదు. కానీ రిషిని కలిశాక వీరి వివాహానికి అంగీకరించారు.

కుటుంబ నేప‌థ్యం :
నారాయణ కర్ణాటక మైసూరులోని కోలార్ జిల్లా, సిడ్లఘట్టలో జన్మించారు. అతను పేద కుటుంబానికి చెందినవాడు. అతని తండ్రి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు. అతను తెలివైన విద్యార్థులలో ఒకడిగా ఉండే వాడు. తరచుగా తన స్నేహితులకు చదువులో సహాయం చేసేవాడు. తొలినాళ్ల నుంచి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఇంజినీరింగ్‌ చదవాలని కలలు కన్నాడు. తొలి ప్రయత్నంలోనే పరీక్షకు హాజరై మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు.

ఈ ఏడాది ఇన్ఫోసిస్‌లో కరోడ్‌పతి ఉద్యోగులు వీళ్లే..

#Tags