ఇన్ఫోసిస్ సైన్స్ అవార్డుకు ఎంపికైన సీసీఎంబీ శాస్త్రవేత్త?
Sakshi Education
శాస్త్ర, పరిశోధన రంగాల్లో చేసిన కృషికి గాను దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థ అందించే... ఇన్ఫోసిస్ సైన్స్ అవార్డుకు 2020 ఏడాది హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) శాస్త్రవేత్త డాక్టర్ రాజన్ శంకరనారాయణన్ ఎంపికయ్యారు.
జీవశాస్త్ర రంగానికి సంబంధించి డాక్టర్ రాజన్‌ను, ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ విభాగంలో హరి బాలక్రిష్ణన్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు డిసెంబర్ 2న ఇన్ఫోసిస్ తెలిపింది. అమెరికాలోని మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎమ్‌ఐటీ)లో ఫ్రొపెసర్‌గా హరి బాలక్రిష్ణన్ పనిచేస్తున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇన్ఫోసిస్ సైన్స్ అవార్డుకు 2020కు ఎంపిక
ఎప్పుడు : డిసెంబర్ 2
ఎవరు : డాక్టర్ రాజన్ శంకరనారాయణన్, ఫ్రొపెసర్ హరి బాలక్రిష్ణన్
ఎందుకు : శాస్త్ర, పరిశోధన రంగాల్లో చేసిన కృషికి గాను
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇన్ఫోసిస్ సైన్స్ అవార్డుకు 2020కు ఎంపిక
ఎప్పుడు : డిసెంబర్ 2
ఎవరు : డాక్టర్ రాజన్ శంకరనారాయణన్, ఫ్రొపెసర్ హరి బాలక్రిష్ణన్
ఎందుకు : శాస్త్ర, పరిశోధన రంగాల్లో చేసిన కృషికి గాను
Published date : 03 Dec 2020 05:39PM