Creamy Layer vs. Non-Creamy Layer of OBCs: ఓబీసీల్లో క్రిమీ లేయర్‌, నాన్‌ క్రిమీ లేయర్లుగా ఎవరిని పరిగణిస్తారు?

మనదేశంలో వెనకబడిన తరగతులు(OBC)లకు వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులను బట్టి బట్టి రిజర్వేషన్‌ ప్రయోజనాలు వర్తిస్తాయి. క్రిమీ లేయర్‌, నాన్‌ క్రిమీ లేయర్‌ కోటా కింద వెనుకబడిన కులాలకు విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో  రిజర్వేషన్‌ కల్పిస్తారు. ఇంతకీ ఓబీసీలుగా ఎవరిని పరిగణిస్తారు? క్రిమీ లేయర్‌, నాన్‌ క్రిమీ లేయర్‌ అంటే ఏమిటి? అన్నది ఈ కథనంలో తెలుసుకుందాం. 


OBCలుగా ఎవరిని వర్గీకరిస్తారు?
సామాజికంగా,విద్యాపరంగా వెనుకబడిన కులాలను ఓబీసీ(Other Backward Classes)లుగా వర్గీకరిస్తారు. ఇంతకుముందు షెడ్యూల్‌ కులాలకు, తెగలకు మాత్రమే రిజన్వేషన్లు వర్తించేవి. కానీ 1951లో మొదటి రాజ్యాంగ సవరణ చేస్తూ, ఆర్టికల్‌ 15(4)ను చేర్చి సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల(బీసీ ఓబీసీ)వారికి రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కల్పనకు అవకాశం కల్పించింది. 


క్రిమీ లేయర్‌- నాన్‌ క్రిమీ లేయర్‌లుగా ఎవరిని పరిగణిస్తారు?

క్రిమీలేయర్‌ అంటే?
ఓబీసీ కేటగిరీలోనే క్రిమీ/నాన్‌ క్రిమీ లేయర్‌ అని రెండు రకాలుగా విభజిస్తారు. ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందిన వారిని 'సంపన్నశ్రేణి' లేదా క్రీమిలేయర్‌గా పేర్కొంటారు. వీళ్లకు ఎలాంటి ప్రత్యేక రిజర్వేషన్లు ఉండవు. వీళ్లు కూడా ఉద్యోగాల్లో ఓపెన్‌ కేటగిరిలోనే పోటాపడాల్సి ఉంటుంది. ఆదాయ పరిమితి సంవత్సరానికి రూ.8 లక్షలకు మించి(నెల జీతం, వ్యవసాయ భూమి నుంచి వచ్చే ఆదాయాన్ని మినహాయించి) ఉండే వారిని క్రిమీ లేయర్‌గా పరిగణిస్తారు. వెనుకబడిన తరగతులవారైనప్పటికీ సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందినందున వీళ్లను  రిజర్వేషన్ పొందుటకు అనర్హులుగా పరిగణిస్తారు. 

నాన్‌ క్రిమీలేయర్‌ అంటే?
ఆదాయ పరిమితి సంవత్సరానికి ₹8 లక్షల కంటే తక్కువగా ఉన్న వారిని నాన్‌ క్రిమీలేయర్‌ కింద చూస్తారు. వీరికి విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ఉద్యాగాల్లో 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లను కల్పిస్తున్నారు. 

#Tags