Chandrayaan 3 Women Scientists : చంద్రయాన్‌–3 ప్రాజెక్టులో.. 30 శాతం మంది మహిళా శాస్త్రవేత్త‌లే.. అత్యంత కీలకమైన మహిళా శాస్త్రవేత్తగా..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా శుక్రవారం మధ్యాహ్నం ప్రయోగించిన చంద్రయాన్‌–3 ప్రాజెక్టులో 30 శాతం మంది మహిళా శాస్త్రవేత్తలు పనిచేసినట్టు తెలుస్తోంది.
chandrayaan 3

అంతరిక్ష శాస్త్ర విజ్ఞాన రంగం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో తామేమీ తక్కువ కాదన్నట్టుగా చంద్రయాన్‌–2 ప్రయోగంలో పనిచేసిన 30 శాతం మంది మహిళలు, చంద్రయాన్‌–3లో కూడా పనిచేశారు. 

☛ Ritu Karidhal Success Story : నాడు కోచింగ్‌ వెళ్లేంత స్థోమత లేదు.. నేడు దేశం మొత్తం గర్వించే.. ‘రాకెట్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరు తెచ్చుకున్నారిలా..

త్రీ–ఇన్‌–ఒన్‌గా చెప్పబడుతున్న చంద్రయాన్‌–3 ప్రాజెక్టులో ప్రపొల్షన్‌ మాడ్యూల్‌, ల్యాండర్‌, రోవర్లు రూపొందించడంలో మహిళా శాస్త్రవేత్తల కృషి కూడా ఉంది. అహ్మదాబాద్‌లోని స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌, బెంగళూరులోని ప్రొఫెసర్‌ యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌లో పురుష శాస్త్రవేత్తలకన్నా తామేమీ తక్కువ కాదన్నట్టుగా పనిచేసి ల్యాండర్‌, రోవర్‌ను రూపొందించడంలో మహిళా శాస్త్రవేత్తలు భాగస్వామ్యం కూడా కలిసింది. 

ఇస్రోలో 30 మంది మహిళా శాస్త్రవేత్తలు పనిచేస్తుండగా ఈ ప్రయోగంలో రీతూ కరిథల్‌, ఎం.వనిత అత్యంత కీలక వ్యక్తులుగా పనిచేశారు. బాలు శ్రీ దేశాయ్‌, డాక్టర్‌ సీత, కే కల్పన, టెస్సీ థామస్‌, డాక్టర్‌ నేహ సటక్‌ తదితర మహిళా శాస్త్రవేత్తలు ఈ ప్రయోగంలో భాగస్వాములై మహిళాశక్తిని నిరూపించారు.
రాకెట్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఇండియా రీతూ కరిథల్‌

చంద్రయాన్‌–2 మిషన్‌ డైరెక్టర్‌గా వ్యవహరించిన రీతూ కరిథల్‌ ‘రాకెట్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఇండియా’గా ఇస్రోలో అందరూ పిలుస్తున్నారు. మార్స్‌ అర్బిటర్‌ మిషన్‌ ప్రయోగంలో కూడా ఆమె డిప్యూటీ ఆపరేషన్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈమె 2007లో మాజీ రాష్ట్రపతి, అణు పరీక్షల నిపుణులు దివంగత డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌కలాం చేతులు మీదగా ఇస్రో యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డు కూడా అందుకున్నారు. 

చంద్రయాన్‌–2 మిషన్‌లో అత్యంత కీలకమైన మహిళా శాస్త్రవేత్తగా అందరి మన్ననలను పొందారు. ఆమె చంద్రయాన్‌–3 ప్రాజెక్టులో కూడా పనిచేశారు. చంద్రయాన్‌–2 ప్రాజెక్టుకు డైరెక్టర్‌గా పనిచేసిన ఎం.వనిత ఉపగ్రహాలు తయారు చేయడంలో దిట్ట. ఆమె డిజైన్‌ ఇంజినీర్‌గా శిక్షణ తీసుకుని చంద్రయాన్‌–2 అత్యంత కీలకమైన శాస్త్రవేత్తగా ఎంతో గుర్తింపు పొందారు.‘ఆస్ట్రనామికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా’ నుంచి 2006లో బెస్ట్‌ ఉమెన్‌ సైంటిస్టు అవార్డును అందుకున్నారు. చంద్రయాన్‌–3 ప్రాజెక్టులోనూ ఆమె కీలకపాత్ర పోషించారు.

☛ Chandrayaan 3 launch live updates : చంద్రయాన్‌-3 లక్ష్యాలు ఇవే.. ప్రయోగం ఇలా.. అలాగే ఉప‌యోగాలు ఇవే..​​​​​​​

#Tags