AP CM YS Jagan: 1వ‌ తరగతిలోనే బీజం వేస్తే...20 ఏళ్ల తర్వాత పోటీ పరీక్షలకు సిద్ధంగా..

సాక్షి, అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగంలో పెను మార్పులు తీసుకువచ్చామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.
AP CM YS Jagan Mohan Reddy

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం జగన్‌ విద్యారంగంపై న‌వంబ‌ర్ 26వ తేదీన (శుక్ర‌వారం) ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్ధి చదువుకునే అవకాశం కల్పించామని, ఒకటో తరగతితో బీజం వేస్తే.. 20 ఏళ్ల తర్వాత పోటీ పరీక్షలకు సిద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. 96 శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లీష్‌ మీడియం కోరుతున్నారని పేర్కొన్నారు. రైట్‌ టు ఇంగ్లీష్‌ మీడియం ఎడ్యుకేషన్‌ మారుస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు. అంగన్‌వాడి నుంచి ఇంగ్లీష్‌ మీడియం వైపు పిల్లలను మళ్లించాలని తెలిపారు. విద్యాపరంగా సామాజిక న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. విద్యారంగంలో అవసరమైన మార్పులు, చేర్పులు చేపడుతున్నామని తెలిపారు.

44.50 లక్షల మంది విద్యార్థుల తల్లులకు..
20 మంది పిల్లలకు ఒక టీచర్‌ను.. అదే విధంగా సబ్జెక్టుల వారీగా టీచర్లను నియమించామని సీఎం తెలిపారు. అమ్మఒడి పథకంలో విద్యార్థుల తల్లులను భాగస్వామ్యం చేశామని చెప్పారు. పిల్లలను బాగా చదివించేందుకు జగనన్న గోరుముద్దు పథకాన్ని తీసుకొచ్చామని తెలిపారు. 44.50 లక్షల మంది విద్యార్థుల తల్లులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతోందని చెప్పారు.

85 లక్షల మంది విద్యార్థులకు..
అమ్మ ఒడి పథకం ద్వారా 85 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతోందని సీఎం జగన్‌ తెలిపారు. అమ్మఒడి పథకం క్రింద ఏడాదికీ రూ.6,500 కోట్లు కేటాయించామని తెలిపారు. జగనన్న గోరు ముద్ద పథకాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక యాప్‌ రూపొందించామని చెప్పారు. విద్యార్థులకు విద్యాకానుక, తల్లులకు అమ్మ ఒడి పథకాలను తీసుకువచ్చామని.. గోరుముద్దు కోసమే రూ.1600 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. 2 ఏళ్ల కాలంలో అమ్మఒడి పథకానికి రూ.13,023కోట్లు కేటాయించామని చెప్పారు. అమ్మఒడి ద్వారా ప్రభుత్వ స్కూళ్లులో విద్యార్థుల సంఖ్య పెరిగిందని అన్నారు. గతంలో చదువుకునే స్థాయి నుంచి చదువుకొనే స్థాయికి తెచ్చారని తెలిపారు. గత ప్రభుత్వం చదువును కొనుక్కునే పరిస్థితి తెచ్చిందని, ప్రభుత్వం స్కూళ్లను నిర్వీర్యం చేసి ప్రైవేట్‌కు పట్టం కట్టారని సీఎం జగన్ అన్నారు.

#Tags