Diploma in Elementary Education 2022–24: 19 నుంచి డీఈడీ 1st సెమిస్టర్‌ పరీక్షలు

ఒంగోలు: డిప్లమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ 2022–24 బ్యాచ్‌, 2020–22 , 2021–23 సంవత్సరాల్లో పరీక్షలు రాసి ఫెయిలైన విద్యార్థులకు మొదటి సెమిస్టర్‌ పరీక్షలు సెప్టెంబర్‌ 19 నుంచి నిర్వహించనున్నట్లు డీఈఓ వీఎస్‌ సుబ్బారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
19 నుంచి డీఈడీ మొదటి సెమిస్టర్‌ పరీక్షలు

ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సబ్జెక్టుకు రూ.100, రెండో సబ్జెక్టుకు రూ.120, మూడో సబ్జెక్టుకు రూ.140, అంతకు మించి సబ్జెక్టుకు రూ.150 పరీక్ష ఫీజు ఈ నెల 30వ తేదీ లోగా చెల్లించాలన్నారు. సెప్టెంబర్‌ 6వ తేదీ లోగా రూ.50 అపరాధ రుసుంతో పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Also read: Nadu Nedu: Revolutionizing AP Govt Schools with AI Technology #sakshieducation

#Tags