D Pharmacy Course: ఫార్మసీలో తొలి మెట్టుగా డీ ఫార్మ‌సీ.. రేపే చివ‌రి తేదీ!

పాలిటెక్నిక్‌ విద్యలో భాగంగా ఒక బ్రాంచ్‌గా ఉన్న డిప్లమా ఇన్‌ ఫార్మసీ (డీ పార్మసీ) కోర్సును రెండేళ్ల కాలపరిమితో ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా రూపొందించింది.

కడప: పేద, మ‌ధ్య‌ తరగతి విద్యార్థులు తక్కువ వ్యవధిలో తమ కాళ్లపై తాము నిలబడేలా డీ ఫార్మసీ కోర్సు భరోసానిస్తోంది. పాలిటెక్నిక్‌ విద్యలో భాగంగా ఒక బ్రాంచ్‌గా ఉన్న డిప్లమా ఇన్‌ ఫార్మసీ (డీ పార్మసీ) కోర్సును రెండేళ్ల కాలపరిమితో ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా రూపొందించింది. ఫార్మీసీ రంగంలో ఉన్నతంగా స్థిరపడేందుకు తొలి మెట్టుగా ఇది ఉపయోగపడుతుంది. తరగతి గదిలో పాఠ్యాంశాల ఆధారిత విజ్ఞానంతోపాటు క్షేత్రస్థాయి సందర్శనాల ద్వారా ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ పంచుకునే విధంగా కోర్సును రూపకల్పన చేశారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది.

Guest Lecturer Posts: గెస్ట్‌ లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..

విద్యార్హత ఇలా..

ఇంటర్మీడియట్‌ ఎంపీసీ, బైపీసీ రెగ్యులర్‌తో పాటు దూరవిద్య ద్వారా పూర్తి చేసిన విద్యార్థినులకు ఇంటర్‌ మార్కుల ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తారు. ఆసక్తి ఉన్న విద్యార్థినిలు ఈ నెల 15లోపు https:/apsbtet.in/pharmacya లేదా https:apsbtet.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. తరువాత ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ద్వారా ర్యాంకులను బట్టి ప్రవేశాలు కల్పిస్తారు.

రెండేళ్ల కోర్సుకు సంబంధించి..

డీ ఫార్మసీ రెండేళ్ల కోర్సుకు సంబంధించి ప్రథమ, ద్వితీయ సంవత్సరాలలో మొత్తం 11 సబ్జెక్టులు ఉంటాయి. ఆంగ్లమాధ్యమంలో బోధన ఉంటుంది. కోర్సులో భాగంగా ఔషధాలను తయారు చేయటం, మానవ శరీర అవయవాలపై అవి పని చేసే విధానం , ఔషద మొక్కలు, ఫార్మసీ చట్టాలు, ఫార్మసిస్టుగా, డ్రగ్‌ డిస్పెన్సింగ్‌, పెషంట్‌ కౌన్సిలింగ్‌పై అవగాహన కల్పిస్తారు.

Free Coaching: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో గ్రూప్‌–2, 3 పరీక్షలకు ఉచిత శిక్షణ.. దరఖాస్తు చేసుకోండి..

నాలుగు జిల్లాలో కడపలో ఏకైక కళాశాల..

రాయలసీమలోని కడప, కర్నూల్‌, చిత్తూరు, అనంతపురం జోన్‌ –4కు ప్రత్యేకించి బాలికల కోసం డీఫార్మసీ కోర్సును కడప రామాంజనేయపురంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నిర్వహించే కౌన్సెలింగ్‌ ద్వారా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు అడ్మిషన్‌ ఫీజు మినహాయింపుతోపాటు ఉపకార వేతన పొందేందుకు కూడా అవకాశం ఉంది,

హాస్టల్‌ సౌకర్యం ప్రత్యేకం..

కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో చదివే విద్యార్థులకు అన్ని బోధనా వసతులతోపాటు ప్రత్యేకంగా హాస్టల్‌ వసతి ఉంది. హాస్టల్‌ కూడా కళాశాలలోనే ఉండటంతో బాలికలకు పూర్థిస్థాయిలో సంరక్షణ ఉంటుంది. ధైర్యంగా చదువుకునేందుకు వీలుంటుంది. నాలుగు జిల్లాలలో ఎక్కడి నుంచి విద్యార్థినిలు వచ్చినా వారి వసతికి సంబంధించి ఎలాంటి సమస్య ఉండదు.

AP Pension Kanuka: ఏపీలో ఫించన్‌ పథకం పేరు మార్పు.. పింఛన్ నగదు పెంపు.. ఎంతంటే..

ఉపాధి అవకాశాలు ఇలా..

డి ఫార్మసీ కోర్సు పూర్తి చేసిన వెంటనే విస్తృత రీతిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కమ్యూనిటీ ఫార్మసిస్టు, హాస్పిటల్‌ ఫార్మసిస్టు, మార్కెటింగ్‌ డ్రగ్‌ రిప్రజెంటేటివ్‌గా ఫార్మసిస్టు ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఔషధ దుకాణాలలో రిటైల్‌ ఫార్మసిస్టులుగా ఉద్యోగాలను అందిపుచ్చుకోవచ్చు. ఆర్థిక స్థోమత ఉంటే తాము సొంతంగా ఔషధ దుకాణం ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతూ మరి కొంతమందికి ఉపాధి కల్పించవచ్చు. పరిశ్రమలు, రైల్వే ఆసుపత్రులో ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఈ రంగంలో వేతనాలు అధికంగా ఉన్నందున ఎక్కడయినా ఉపాధికి భరోసా ఉంటుంది. డీ ఫార్మసీ కోర్సు చదివిన తరువాత ఉన్నత చదువులకు ఈసెట్‌ ద్వారా బి ఫార్మసీ రెండవ ఏడాదిలోకి ప్రవేశం పొందవచ్చు.

NEET UG 2024: ‘నీట్‌’ గ్రేసు మార్కులు రద్దు.. మళ్లీ నీట్‌ పరీక్ష

వందశాతం ఉపాధి

గత విద్యా సంవత్సరంలో కళాశాల నుంచి డీ ఫార్మసీ పూర్తి చేసిన విద్యార్థినులకు అపోలో ఫార్మసీలో వందశాతం ఉద్యోగాలను కల్పించాం. ఆసక్తి గల విద్యార్థినులు ఈ నెల 15లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. కళాశాల ద్వారా ఆన్‌లైన్‌ దరఖాస్తు పంపడంలో సహాయం అందిస్తాము. ప్రవేశాల సమచారానికి 7981353745, 9440144057 నెంబర్‌ను సంప్రదించాలి.

– సిహెచ్‌ జ్యోతి, ప్రిన్సిపాల్‌, ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల, కడప

Management Trainee Posts: ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులు.. చివ‌రి తేదీ ఇదే..!

#Tags