Placement Selections in PU: క్యాంపస్ సెలెక్షన్స్‌లో ఎంపికైన పీయూ విద్యార్థులు..
ఉద్యోగాల కోసం ప్రతీ కళాశాలలో నిర్వహించినట్టే పీయూలో కూడా నిర్వహించిన ప్లేస్మెంట్స్‌లో మొత్తం 34 మంది విద్యార్థులు ఎంపికైనట్లు తెలిపారు ఆఫీసర్. ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ..
మహబూబ్‌నగర్: పాలమూరు యూనివర్సిటీలో గురువారం చేపట్టిన క్యాంపస్ సెలక్షన్స్‌లో 34 మంది ఎంపికయ్యారు. ఈ మేరకు అన్నపూర్ణ ఫైనాన్స్ ఆధ్వర్యంలో సెలక్షన్స్ చేపట్టగా అందులో ఎంబీఏ, ఎంకాం విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్లేస్‌మెంట్ అధికారి అర్జున్‌కుమార్ మాట్లాడుతూ పీయూ విద్యార్థులు అన్ని సెలక్షన్స్‌లో పూర్తిస్థాయి ప్రతిభ కనబరుస్తున్నారని చెప్పారు.
Facilities in Schools: పాఠశాలల్లో మరమ్మత్తుల పనులకు ప్రణాళికతో పూర్తి చేయాలి..
ఎంపికల్లో ఒకేసారి 34 మంది ఉద్యోగాలు సాధించడం గొప్ప విషయం అని, ఎంపికైన వారికి త్వరలోనే వీసీ సమక్షంలో అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇస్తామన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చంద్రకిరణ్, సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
TSRTC: ఇకపై జీన్స్, టీషర్ట్స్ వేసుకురావొద్దు.. ఆర్టీసీ కీలక ఆదేశాలు
#Tags