Lecturer Posts: ఈనెల 22లోగా గెస్ట్ లెక్చ‌ర‌ర్ పోస్టుకు ద‌ర‌ఖాస్తులు

వివిధ జూనియ‌ర్ కాలేజీల్లో లెక్చ‌ర‌ర్ పోస్టులు ఖాళీగా ఉన్న‌ప్ప‌టికీ వాటిని భ‌ర్తీ చేయ‌డానికి అర్హులైన‌వారు వెంట‌నే ద‌ర‌ఖాస్తులు చేసుకొని, ఇంట‌ర్య్వూకు సిద్ధం అవ్వాల‌ని స్ప‌ష్టం చేసారు. భ‌ర్తీ చేయాల్సిన పోస్టుల‌ను కూడా వివరించారు.
guest lecture posts applications for the eligibles

సాక్షి ఎడ్యుకేష‌న్: జిల్లాలోని వివిధ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్‌ పోస్టులను గెస్ట్‌ లెక్చరర్‌ విధానంపై భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అరకులోయ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో గణితం–1, బోటనీ–1, షార్ట్‌హాండ్‌–1, ముంచంగిపుట్టు కళాశాలలో గణితం–1, బోటనీ, దేవిపట్నంలో తెలుగు–1, రంపచోడవరంలో ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్‌)–1, వి.ఆర్‌.పురంలో సివిక్స్‌–1, చింతూరులో ఫిజిక్స్‌–1, కూనవరంలో తెలుగు–1, నెల్లిపాకలో తెలుగు–1, పాడేరు కళాశాలలో ఇంగ్లిష్‌–1, ఫిజిక్స్‌–1, ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్‌)–2 పోస్టులు భర్తీ చేయనున్నుట్టు పేర్కొన్నారు.

Show Cause Notice: ఇంజ‌నీర్ల‌కు షోకాజ్ నోటీసులు జారీ

ఎంపీహెచ్‌డబ్ల్యూ పోస్టులకు బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్హతలు ఉండాలన్నారు. గెస్ట్‌ లెక్చరర్‌ పోస్టులకు పీజీలో 50శాతం మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని కలెక్టర్‌ తెలిపారు.అభ్యర్థులు ఈనెల 22వ తేదీ లోగా పాడేరు ఐటీడీఏ కార్యాలయానికి దరఖాస్తులు అందజేయాలని, ఈనెల 25న కలెక్టరేట్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని కలెక్టర్‌ తెలిపారు. ఇంటర్వ్యూ సమయానికి పోస్టుల సంఖ్య పెరగడం లేక తగ్గే అవకాశాలున్నట్టు పేర్కొన్నారు.

#Tags