Inspire Story : రైతు బిడ్డ.. 13 ఏళ్లకే ఐఐటీ.. 24 ఏళ్లకే యాపిల్ ఉద్యోగం.. కానీ..

ఎంతో పేదింటి బిడ్డ‌లు.. విద్య అనే ఆయుధం ద్వారా.. ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహిస్తున్నారు. స‌రిగ్గా ఇలాగే.. బిహార్ కు చెందిన రైతు బిడ్డ..సత్యం కుమార్ చిన్న వ‌య‌స్సులోనే ల‌క్ష‌ల జీతం వ‌చ్చే ఉద్యోగం సాధించాడు.

చిన్నప్పటి నుంచే చదువుల్లో అత్యంత చురుగ్గా ఉండేవాడు. 13 ఏళ్లకే ఐఐటీ జేఈఈలో 679 ర్యాంక్ సాధించి రికార్డు సృష్టించాడు. ఈ నేప‌థ్యంలో రైతు బిడ్డ..సత్యం కుమార్ స‌క్సెస్ స్టోరీ మీకోసం..

కుటుంబ నేప‌థ్యం :

సత్యం కుమార్.. బిహార్‌లోని భోజ్ పూర్ జిల్లాలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. చిన్న వయస్సు నుంచే అపారమైన తెలివితేటలను చూపేవాడు. ప్రస్తుతం యూఎస్‌లో ఉన్నత చదువులు అభ్యసిస్తున్నాడు. 

ఎడ్యుకేష‌న్ : 

సత్యం కుమార్..2012లో.. అంటే 12 ఏళ్ల వయస్సులోనే ఐఐటీ జేఈఈ ర్యాంక్ సంపాదించాడు. కానీ ఆ ర్యాంక్ 8000 పైచిలుకు ఉండడంతో.. మ‌ళ్లి సంవ‌త్స‌రం.. మళ్లీ రాద్దామని డిసైడ్ అయ్యాడు. 2013 లో మళ్లీ ఐఐటీ జేఈఈ రాశాడు. ఈ సారి 679 ర్యాంక్ వచ్చింది. ఐఐటీ కాన్పూర్‌లో అడ్మిషన్ తీసుకున్నాడు. అంటే 13 ఏళ్ల చిన్న వయస్సులోనే ఐఐటీలో జాయిన్ అయ్యాడు. అంతకుముందు, అత్యంత చిన్న వయస్సులో ఐఐటీ లో అడ్మిషన్ సంపాదించిన రికార్డు ఢిల్లీకి చెందిన సాహల్ కౌషిక్ పేరుపై ఉంది. 14 ఏళ్ల వయస్సులో సాహల్ కౌషిక్ ఐఐటీ లో అడ్మిషన్ సంపాదించాడు. ఆ రికార్డును సత్యం కుమార్ బద్ధలు కొట్టాడు. ఆ తరువాత కాన్పూర్ ఐఐటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బీ టెక్ - ఎంటెక్ కంబైన్డ్ కోర్సును 2018లో సత్యం కుమార్ పూర్తి చేశాడు. పీహెచ్‌డీ చేయడం కోసం అమెరికాలోని ఆస్టిన్‌లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన అక్కడ బ్రెయిన్ -మెషీన్ ఇంటర్ ఫేసెస్ (Brain-Machine Interfaces) సబ్జెక్టులో పీహెచ్‌డీ చేస్తున్నాడు.

☛ Inspiring Success Story : యదార్ధ కథ.. ఆక‌లి త‌ట్టుకోలేక బిక్షాటన చేసి క‌డుపు ఆక‌లి తీర్చుకునే వాళ్లం.. ఈ క‌సితోనే చ‌దివి జిల్లా ఎస్పీ స్థాయికి వ‌చ్చానిలా..

ప్ర‌ముఖ కంపెనీ యాపిల్‌లో..

ఐఐటీ కాన్పూర్‌లో ఉండగానే సత్యం.. మూడు ప్రాజెక్టులపై వర్క్ చేశాడు. యూఎస్ వెళ్లిన తరువాత 24 ఏళ్ల వయస్సులో యాపిల్ సంస్థలో మెషీన్ లెర్నింగ్ ఇంటర్న్ గా పని చేశాడు. అక్కడ ఆగస్టు 2023 వరకు ఇంటర్న్ షిప్ చేశాడు. ప్రస్తుతం, యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ లో ‘బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ ఫేసెస్’ స్పెషలైజేషన్ తో గ్రాడ్యుయేట్ రీసెర్చ్ అసిస్టెంట్ గా విధుల్లో ఉన్నాడు. తన స్వరాష్ట్రానికి తిరిగి వెళ్లి, అక్కడి పేద విద్యార్థులకు చదువు నేర్పించాలన్నది తన లక్ష్యమని ఆయన వెల్లడించారు.

☛ Inspiring Success Story : బిచ్చగాళ్లతో రోడ్డుపై పడుకున్నా.. ఇంట‌ర్‌లో అన్ని సబ్జెక్ట్ లు ఫెయిల్.. ఈ క‌సితోనే నేడు ఐపీఎస్ అయ్యానిలా..

#Tags