Postponed degree exams: డిగ్రీ పరీక్షలు వాయిదా?
ఆదిలాబాద్‌రూరల్: ఈనెల 6 నుంచి నిర్వహించనున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు మల్లెల మనోజ్ ప్రకటనలో కోరారు. జిల్లాలో ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రతలు సుమారు 46 డిగ్రీలకు చేరువైనట్లు పేర్కొన్నారు. ఈ మేరకు విద్యార్థులు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ పరీక్షలను వాయిదా వేసి జూన్‌లో నిర్వహించాలని కోరారు.
#Tags