TTD Junior College Admission 2024-25 : టీటీడీ జూనియర్ కళాశాలల్లో ప్ర‌వేశాలు.. ద‌ర‌ఖాస్తు చేసుకోండిలా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తిరుప‌తిలోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల‌లో 2024–25 విద్యా సంవత్సరానికి ప్ర‌వేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టీటీడీ విద్యాశాఖాధికారి డాక్టర్ భాస్కర్ రెడ్డి తెలిపారు.

మే 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్‌లో దరఖాస్తు ఆంగ్ల భాషలో మాత్రమే ఉంది. విద్యార్థుల సౌకర్యార్థం యూజర్ మాన్యువల్‌, ఆయా కళాశాలల ప్రాస్పెక్టస్ ను తెలుగు, ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉంచారు.

☛ Benefits of Taking MPC course in Inter : ఇంట‌ర్‌లో ఎంపీసీ కోర్సు తీసుకుంటే..ఉండే ఉప‌యోగాలు ఇవే..! ఎంపీసీ వైపే ఎక్కువ మంది.. ఎందుకంటే..?

దరఖాస్తు చేసుకోండిలా..
విద్యార్థులు admission.tirumala.org వెబ్ సైట్ ను ఓపెన్ చేసిన వెంటనే  Student Manual in English or Student Manual in Telugu రెండు బాక్స్ లు కనిపిస్తాయి. విద్యార్థులు తమకు కావాల్సిన బాక్స్ పైన క్లిక్ చేయాలి. అందులో దరఖాస్తు చేసే విధానాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. అనంతరం ఇంటర్మీడియేట్ కోర్సుకు Junior Collegeను ఎంపిక చేసుకుని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే స్క్రీన్ పై ఇంగ్లీషు, తెలుగు అనే బాక్స్ లు కనిపిస్తాయి. తమకు కావాల్సిన బాక్స్ పై క్లిక్ చేయగానే టీటీడీ ఆధ్వర్యంలోని రెండు జూనియర్ కళాశాలల్లో ఉన్న గ్రూప్లు  , వాటి లోని సీట్లు, వాటిలో ప్రవేశానికి అర్హతలు, సీట్ల భర్తీ విధానం, మార్గదర్శకాలు తదితర వివరాలు కనిపిస్తాయి.

☛ Benefits of Taking BiPC course in Inter : ఇంట‌ర్‌లో బైపీసీ కోర్సు తీసుకుంటే..ఉండే ఉప‌యోగాలు ఇవే..! బైపీసీతో... క్రేజీ కోర్సులివే..!

#Tags