Internship Offer: ఏయూలో ఇంట‌ర్న‌షిప్ డ్రైవ్ నిర్వాహ‌ణ‌

ఆంధ్ర యూనివ‌ర్సిటీలో నిర్వ‌హిస్తున్న ఇంట‌ర్న‌షిప్ గురించి డిప్యూటీ చీఫ్ ప్ర‌క‌టించారు. ఇందులో చేరి ట్రైనింగ్ తీసుకోవాల‌ని ఆస‌క్తి ఉన్న‌వారు త‌మ పేర్లను హాజ‌రు చేసుకోవాల‌ని తెలిపారు. ఈ ట్రైనింగ్ కు సంబంధించిన వివ‌రాల‌ను కూడా స్ప‌ష్టించారు..
Andhra University conducting Internship drive

సాక్షి ఎడ్యుకేష‌న్: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎంప్లాయిమెంట్‌ ఇన్ఫర్మేషన్‌, గైడెన్స్‌ బ్యూరో ఆధ్వర్యంలో బుధవారం ఇంటర్న్‌షిప్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ చీఫ్‌ కె.దొరబాబు తెలిపారు. మ్యాక్స్‌ రిటైల్‌ డివిజన్‌–లైఫ్‌స్టైల్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 40 మంది ఇంటర్న్‌షిప్‌ ట్రైనీల కోసం డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. ఏదైనా డిగ్రీ చదువుతున్న వారు, బీబీఏ, ఎంబీఏ చదువుతున్న వారు అర్హులు.

Tejashri: అగ్రిసెట్‌లో జోగిపేట విద్యార్థిని స్టేట్‌ ఫస్ట్‌

ఆసక్తి, అర్హత కలిగిన వారు https:// www. ncs. gov. in/ లో పేర్లు నమోదు చేసుకుని.. ఉదయం 10.30 గంటలకు ఏయూ ఎంప్లాయిమెంట్‌ ఇన్ఫర్మేషన్‌, గైడెన్స్‌ బ్యూరో కార్యాలయంలో జరిగే డ్రైవ్‌కు హాజరుకావచ్చు. ఎంపికై న విద్యార్థులకు స్టైఫండ్‌తో పాటు ఇంటర్న్‌షిప్‌ సర్టిఫికెట్‌ అందజేస్తారు. పూర్తి వివరాలకు 90322 27630, 96660 92491ను సంప్రదించవచ్చు.

#Tags