Inter exams schedule in 2024: మరోసారి రివిజన్... వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం!!
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని డీఐఈవో శంక ర్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను గురువారం సందర్శించారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు.
వార్షిక పరీక్షలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు ప్రణాళి క ప్రకారం చదవాలన్నారు. ప్రతిరోజూ కళా శాలకు వచ్చినప్పుడే మెరుగైన మార్కులు సాధించే అవకాశం ఉంటుందన్నారు. సిలబస్ పూర్తయిన నేపథ్యంలో అధ్యాపకులు విద్యార్థులతో మరోసారి రివిజన్ చేయించా లని సూచించారు.
చదువులో వెనుకబడిన వారిపై దృష్టి సారించాలన్నారు. ఇంటర్ ఫస్టియర్ ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌లో ఉత్తమ మార్కులు సాధించేందుకు కృషి చేయాలన్నారు. అనంత రం అధ్యాపకులతో సమావేశమయ్యారు. కళాశాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డీఐఈవోను కళాశాల సిబ్బంది శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అమరేందర్, అధ్యాపకులు నోముల చంద్రశేఖర్, మహేందర్ సిబ్బంది ఉన్నారు.