Degree Supplementary Exams: 28 నుంచి డిగ్రీ స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలు

Degree Supplementary Exams

కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో ఈనెల 28వ తేదీ నుంచి డిగ్రీ స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎన్టీకే నాయక్ ఆదేశాల మేరకుపరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 

35 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష‌న్‌: Click Here

నంద్యాల పీఎస్ సీ అండ్ కేవీఎస్ సీ ప్రభుత్వ డిగ్రీకళాశాల, ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, కర్నూలు సుంకేసుల రోడ్లోని సెయింట్ జోసఫ్స్ డిగ్రీ కళాశాలల్లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. 

పరీక్షలకు మొత్తం 1,145 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. హాల్టికెట్లు ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ వద్ద,లేదా ఆన్లైన్ లోనూ పొందవచ్చన్నారు.

విద్యార్థులకు సూచనలు:
విద్యార్థులు తమ హాల్‌ టికెట్లను మరిచిపోకుండా తీసుకురావాలి.
పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు కంట్రోల్‌ రూమ్‌ వద్ద హాజరు కాబడాలి.
విద్యార్థులు తమ సబ్జెక్టుల షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలకు హాజరుకావాలి.
అదనపు సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ సందర్శించండి.

#Tags