Skip to main content

Backlog posts Examination: SC, ST బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి పరీక్షలు

Backlog posts Examination
Backlog posts Examination

నగరంపాలెం: ఉమ్మడి గుంటూరు జిల్లాలో 54 ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి గతేడాది ఉత్తర్వుల నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ క్రమంలో 2023 మార్చి 25న 34 పోస్టులకు ఎంపిక పక్రియ పూర్తి చేశారు. దీనిపై పిటిషనర్లు హైకోర్టులో కేసు విత్‌ డ్రా చేసుకున్నారు.

దీంతో మిగతా 20 పోస్టులకు ఈ నెల 6 నుంచి 13వ తేదీ వరకు గుంటూరు సిద్ధార్థనగర్‌లోని జేసీ కళాశాల ఆఫ్‌ లాలో రీడ్‌ అండ్‌ రైట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. వెబ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్న 5,116 మంది అభ్యర్ధులకు ఆయా తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. డ్రైన్‌ క్లీనర్‌ పోస్ట్‌కు 86 దరఖాస్తులు స్వీకరించగా, 6న ఉదయం పరీక్ష జరగనుంది.

2 గ్యాంగ్‌ మజ్దూర్‌ పోస్ట్‌లకు 385 దరఖాస్తులు స్వీకరించగా, 6న మధ్యాహ్నం నిర్వహిస్తారు. 12 పబ్లిక్‌ హెల్త్‌ వర్కర్‌ పోస్ట్‌లకు 2,840 దరఖాస్తులు స్వీకరించగా, 7, 8, 9 తేదీల్లో ఉదయం, మధా్‌య్‌హ్నం పరీక్ష జరగనుంది. 3 స్వీపర్‌ పోస్ట్‌లకు 974 దరఖాస్తులు స్వీకరించగా, 12న ఉదయం, మధా్‌య్‌హ్నం పరీక్ష ఉంటుంది.

హోల్‌ టైం సర్వెంట్‌ పోస్ట్‌కు 235 దరఖాస్తులు స్వీకరించగా, 13న ఉదయం పరీక్ష జరగనుంది. కళాసి పోస్ట్‌కు 596 దరఖాస్తులు రాగా, 13న మధా్‌య్‌హ్నం పరీక్ష ఉంటుంది. ఉదయం 10.30 గంటలకు, మధా్‌య్‌హ్నం 2 గంటలకు ఆయా తేదీలలో పరీక్షలు ప్రారంభం అవుతాయి.

అభ్యర్థుల ఒరిజినల్‌ ఆధార్‌ కార్డులు పరిశీలించాకే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించాలని ఆదేశించారు. రైల్వేస్టేషన్‌, ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి పరీక్షా కేంద్రం వరకు బస్‌లు నడపాలని నిర్ణయించారు. 6 నుంచి 13వ తేదీ వరకు పరీక్షా కేంద్రం వద్ద పోలీస్‌ పహారా ఏర్పాటు చేయనున్నారు.

Published date : 06 Aug 2024 08:52AM

Photo Stories